భారతీయ చిత్ర పరిశ్రమకు అమూల్యమైన సేవలు అందించిన సంగీత లెజెండ్ ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాదిలోని అన్ని భాషల్లో తన సంగీతంతో అనేక తరాలను అలరించిన ఈ మహానుభావుడు వందలాది పాటలు, అనేక సంగీత కచేరీలతో దేశ–విదేశాల్లో కోట్లాది సంగీత ప్రేమికుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇప్పటికీ ఆయన సేవలు కొనసాగుతున్నప్పటికీ, మునుపటిలా బిజీగా మాత్రం లేరు. కానీ ఆయన వారసత్వాన్ని తన కుమారుడు యువన్ శంకర్ రాజా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
తండ్రి వారసత్వం ఉన్నప్పటికీ, యువన్ తనదైన శైలి, బాణీలతో తమిళ–తెలుగు ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇళయరాజా–యువన్ కలసి పాట పాడటం మాత్రం ఇంత వరకు జరగలేదు. ఆ అరుదైన ఘట్టం ఇప్పుడు మొదటిసారిగా నిజమైంది.
‘కొంబుసివీ’ చిత్రానికి ఇద్దరూ కలిసి ఒక భావోద్వేగభరితమైన పాట ఆలపించారు. ‘అమ్మా ఎన్ తంగక్కని నీతానే ఎల్లామ్’ అనే ఈ సాంగ్‌ను సాహితీవేత్త విజయ్ రచించగా, యువన్ సంగీతం అందించారు. తండ్రి–కొడుకులు కలసి ఒకే పాటలో పాడటం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని టీమ్ చెబుతోంది.

గతంలో ఇళయరాజా సంగీతం చేసిన కొన్ని చిత్రాల్లో యువన్ గాత్రం వినిపించినా, యువన్ కంపోజ్ చేసిన పాటలో ఇళయరాజా పాడటం మాత్రం ఇదే మొదటిసారి. అందుకే ఈ పాట ఎలా ఉంటుందన్న ఆసక్తి సంగీత ప్రేమికుల్లో పెరిగింది.
పొన్రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సీనియర్ నటుడు శరత్ కుమార్, కెప్టెన్ విజయకాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇద్దరి మధ్య వచ్చే కీలక భావోద్వేగ సన్నివేశంలో ఈ పాట నడుస్తుందని తెలుస్తోంది.
థేని, ఉసిలంపట్టి ప్రాంతాల నేపథ్యంలో కామెడీ–యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి బడ్జెట్‌తో నిర్మాణంలో ఉంది. హీరోయిన్‌గా తార్నిక నటిస్తోంది. అన్ని పనులు పూర్తిచేసి సినిమా డిసెంబర్‌లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం యువన్ శంకర్ రాజా తమిళంతో పాటు తెలుగు సినిమాలకు కూడా సంగీతం అందిస్తూ ఎప్పటిలాగే బిజీగా ఉంటున్నారు.
Recent Random Post: