ఎన్టీఆర్ ‘డ్రాగన్’ లుక్ – ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వైరల్!

Share


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేసుకునే దశలో ఉండగానే, మరో భారీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ పనులు ప్రారంభించాడు. ఈ సినిమాకోసం తన లుక్‌ను మార్చుకున్నట్టు తాజా లీకైన ఫోటోల ద్వారా స్పష్టమవుతోంది. తాజా లుక్‌లో తారక్ మరింత స్లిమ్‌గా కనిపిస్తుండటం, మునుపటి కంటే బరువు తగ్గడం, ముఖంలో స్వల్ప మార్పులు రావడం గమనించవచ్చు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అవసరమైన లుక్ కోసం ఎన్టీఆర్ మూడు నెలల కిందటే ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను ప్రారంభించాడు. ఇప్పుడది పూర్తయిందని సమాచారం. ఇదిలా ఉండగా, ఇటీవలే ‘వార్ 2’ షెడ్యూల్‌ నుంచి ఎన్టీఆర్ బ్రేక్ తీసుకున్నాడు. ఈ గ్యాప్‌లో నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత, ఏప్రిల్ చివరి వారంలో ‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ చిత్రీకరణను ప్రారంభించి, ఎన్టీఆర్ లేని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఏప్రిల్ చివరి వరకు ఇతర క్యారెక్టర్లపై షూటింగ్ జరిపి, ఆ తర్వాత తారక్ ఎంట్రీ ఇవ్వగానే అతడి సన్నివేశాలపై పూర్తి దృష్టి పెట్టనున్నాడు. ఇక తారక్ లుక్ పరంగా కొన్ని తుది మార్పులు అవసరమైతే, ఈ నెల రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది.

ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ వరుసగా ‘దేవర’ షూటింగ్ ముగించగానే, వెంటనే ‘వార్ 2’ సెట్స్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబానికి సరైన సమయం కేటాయించలేకపోయాడు. ప్రస్తుతం ఈ నెల విరామం తీసుకుంటున్నందున, కుటుంబంతో కలిసి విదేశీ విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.


Recent Random Post: