
రేపు విడుదల కానున్న “ఎల్2 ఎంపురాన్” చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళ ఇండస్ట్రీలో 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన తొలి సినిమా కావడంతో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. దానికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ లో కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి.
సలార్ విలన్‌గా, ఎస్ఎస్ఎంబి 29 లీడ్ ఆర్టిస్ట్‌గా మనకు దగ్గరవుతున్న పృథ్విరాజ్, ఇప్పుడు దర్శకుడిగా కూడా తన మార్క్ చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే, ఈ చిత్రం ఆయనకు సవాల్‌గా మారింది. సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో కలిసి గత పది రోజులుగా దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రెస్ మీట్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు.
ఈ సందర్భంగా పృథ్విరాజ్, ఇండస్ట్రీలోని వ్యాపార పరమైన కోణాన్ని ఆసక్తికరంగా విశ్లేశించాడు.
“సినిమా అంటే ఎప్పుడూ స్థిరమైన లాభాలు ఇచ్చే వ్యాపారం కాదు. ఇది అత్యంత రిస్క్ ఉన్న పరిశ్రమ. 2024లో మలయాళ ఇండస్ట్రీలో 200 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ, వాటిలో కేవలం 24 మాత్రమే విజయవంతమయ్యాయి. మిగిలినవి కనీస స్థాయిలో కూడా ఆడలేకపోయాయి” అని వివరించాడు.
ఇన్ని నష్టాలు ఉంటే నిర్మాతలు ఎందుకు పెట్టుబడులు పెడతారనే ప్రశ్నకు “ఏవైతే సినిమాలు హిట్ అవుతున్నాయో, అవి 300-400% వరకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అదే మళ్లీ పెట్టుబడిదారులను ఈ ఫీల్డ్‌లోకి రప్పిస్తోంది. ఇది ఒకరకంగా గ్యాంబ్లింగ్ లాంటిదే” అంటూ స్పష్టమైన సమాధానం ఇచ్చాడు.
ఇక టాలీవుడ్ విషయంలో ఫెయిల్యూర్ రేటు అంత తీవ్రమైనది కాకపోయినా, కంటెంట్ మీద మరింత దృష్టి పెట్టి, నాణ్యమైన కథలతో సినిమాలు తీయాల్సిన అవసరం ఇప్పుడు మరింత స్పష్టమైంది. ఎల్2 ఎంపురాన్ ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుంటుందో చూడాలి!
Recent Random Post:















