ఓటీటీ డీల్ వల్ల నిలిచిపోయిన నారీ నారీ నడుమ మురారి విడుదల

Share


సినీ ఇండస్ట్రీలో ప్రతి సినిమాకు ఒక ప్రత్యేకమైన సవాలు ఉంటుంది. కొన్నింటికి సెట్స్ మీదకే వెళ్లడం కష్టమైతే, మరికొన్నింటికి షూటింగ్ పూర్తయ్యాక రిలీజ్ అవ్వడం కష్టమవుతుంది. ఎక్కడో క్యాస్టింగ్ ఇష్యూలు, ఎక్కడో బడ్జెట్ – బిజినెస్ సమస్యలు ఇబ్బందులు పెడుతుంటాయి. తాజాగా ఇలాంటి బిజినెస్ సమస్యల కారణంగా టాలీవుడ్‌లో ఒక సినిమా ఆలస్యమవుతోంది.

శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా ముగిసినా కూడా, రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. కారణం – ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ ఇంకా ఫైనల్ కాకపోవడమే అని సమాచారం.

సినిమా బిజినెస్‌లో ఇప్పుడు ఓటీటీ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ డీల్ క్లోజ్ అయ్యేవరకు విడుదల తేదీని ప్రకటించకుండా నిర్మాతలు వేచి చూస్తున్నారు.

సామజవరగమన సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ ఒక కొత్త పాత్రలో కనిపించనున్నారు.

ఓటీటీ ఒప్పందం పూర్తయ్యాక, మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశముంది.


Recent Random Post: