
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, ప్రతిభావంతుడైన దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఎ.డి ఎలా ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్‌లో వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్‌గా కనిపించి ప్రేక్షకులను అలరించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సహా పలువురు అతిథి పాత్రల్లో కనిపించి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె ఫిమేల్ లీడ్ రోల్‌లో నటించి తనదైన ముద్ర వేసింది.
బౌంటీ హంటర్ భైరవగా ప్రభాస్ అదరగొట్టగా, చివర్లో కర్ణుడిగా దర్శనం ఇచ్చి సీక్వెల్ పై భారీ అంచనాలు క్రియేట్ చేశాడు. అందుకే ప్రస్తుతం కల్కి 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.part-2 కి సంబంధించిన 30% షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందట. పార్ట్-1 షూటింగ్ జరుగుతూనే మేకర్స్ కొన్ని భాగాలు పూర్తి చేయడం విశేషం. ఇక మిగిలిన షూటింగ్ త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా, సీక్వెల్‌లో దీపికా పదుకొణె ఉంటారా? అన్న అనుమానాలు ఇటీవల వెలువడుతున్నాయి. భారీ రెమ్యునరేషన్ కారణంగా ఆమెను మేకర్స్ తప్పించారని కొన్ని సోషల్ మీడియా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇవన్నీ రూమర్లే అని స్పష్టం అయింది. కల్కి 2లో కూడా దీపిక కీలక పాత్రలోనే కొనసాగనుందని, ఆమె పాత్రకు కూడా స్టోరీలో ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.
ఇక రెండో భాగంలో కమల్ హాసన్ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందని టాక్. ప్రభాస్-కమల్ హాసన్ మధ్య కీలకమైన సన్నివేశాలు ఉండబోతున్నాయట. సీక్వెల్ 2026లో విడుదల కానుందని వార్తలు వచ్చాయి. మొత్తం మీద కల్కి 2898 ఎ.డి పార్ట్ 2 ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కొనసాగుతోంది.
Recent Random Post:















