కింగ్ డమ్‌తో విజయ్ దేవరకొండ మాస్ దూకుడు!

Share


విజయ్ దేవరకొండ తన రౌడీ ఫ్యాన్స్‌ను అలరించేందుకు వరుసగా మాస్ ఎంటర్టైనర్స్ ప్లాన్ చేస్తున్నాడు. గతేడాది ఫ్యామిలీ స్టార్ సినిమా నిరాశ పరచడంతో, ఇకపై ప్రతి సినిమా హిట్టయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్ డమ్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. రీసెంట్‌గా వచ్చిన టీజర్ చూస్తేనే ఈ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది.

ఇంతకాలం విజయ్ దేవరకొండ స్టామినాకు తగిన సినిమా రాలేదని భావించిన ఫ్యాన్స్, కింగ్ డమ్ అయితే మాస్ విధ్వంసం సృష్టిస్తుందని ఆశిస్తున్నారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కిస్తుండటంతో, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని హంగులతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ మాస్ హీరోగా మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉందని టాక్.

ఇదిలా ఉంటే, కింగ్ డమ్ తర్వాత విజయ్ దేవరకొండ తన ప్రాజెక్ట్స్‌ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. తదుపరి రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. తెలంగాణా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ విలేజ్ డ్రామాలో కొత్త నటీనటులను ఎంపిక చేసేందుకు కాస్టింగ్ కాల్స్ నిర్వహిస్తున్నారు.

అలాగే, శ్యామ్ సింగ రాయ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌తో విజయ్ మరో సినిమా చేయనున్నాడు. వీరిద్దరి కలయికలో ఇప్పటికే టాక్సీవాలా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈసారి రాహుల్ విజయ్‌తో ఓ పీరియాడికల్ స్టోరీ తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది.

సొ కింగ్ డమ్తో ప్రారంభమయ్యే విజయ్ మాస్ అవతారం, రాబోయే సినిమాలతో మరింత పక్కాగా కొనసాగనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ సినిమాలపై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. నిర్మాణ సంస్థలు విజయ్ క్రేజ్‌ను మరింత పెంచేలా భారీ బడ్జెట్ ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇక కింగ్ డమ్లో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్స్ నటిస్తుండగా, రవికిరణ్ కోలా, రాహుల్ సంకృత్యన్ సినిమాల కోసం హీరోయిన్లు ఇంకా ఫైనల్ కాలేదు.

విజయ్ వరుసగా హిట్ సినిమాలతో తన స్థాయిని మరింత పెంచుకుంటాడా లేదా అనేది చూడాల్సిందే!


Recent Random Post: