
కృతి శెట్టి టాలీవుడ్, కోలీవుడ్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం, టాలెంట్ ఉన్నప్పటికీ టాలీవుడ్లో అవకాశాలను నిలబెట్టుకోవడంలో Krithi Shetty కొంత వెనుకబడింది. దీంతో కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా పెద్ద విజయాలు రాకపోయినా, తెలుగుతో పోలిస్తే తమిళంలో మాత్రం కొంత మెరుగైన అవకాశాలు అందుకుంటోంది. సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా మరో ఛాన్స్ దక్కుతోంది. కానీ ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందనేది ప్రశ్నగానే ఉంది. దీంతో ఆమె కెరీర్లో ఒక హిట్ చాలా కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో కృతి ఆశలన్నీ ప్రస్తుతం Love Insurance Company సినిమాపైనే ఉన్నాయి. Vignesh Shivan దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి అంచనాలు సొంతం చేసుకుంది. Pradeep Ranganathan హీరోగా నటిస్తున్న ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రానుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ తీసుకువచ్చింది.
ఇక లేడీ సూపర్ స్టార్ Nayanthara గెస్ట్ రోల్లో కనిపించనుండటం సినిమాకు మరింత క్రేజ్ తెచ్చింది. ఈ సినిమా కృతి శెట్టికి తమిళంలో పెద్ద బ్రేక్ ఇస్తుందని ఆమెతో పాటు మేకర్స్ కూడా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయితే కృతి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే, ఆమె కెరీర్ మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.
ఇప్పటికే కొత్త హీరోయిన్ల నుంచి పోటీ పెరగడం, పాన్-ఇండియా ట్రెండ్ బలపడటం వంటి అంశాలు కృతికి సవాలుగా మారాయి. తమిళంలో మంచి హిట్ సాధిస్తేనే తిరిగి తెలుగు మేకర్స్ ఆమె వైపు చూడే అవకాశం ఉంది. లేకపోతే చిన్న సినిమాలకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే కృతి మాత్రం తనను తాను మెరుగుపరుచుకునే ప్రయత్నంలో ఉంది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ, కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది.
ఈ నేపథ్యంలో Love Insurance Company విజయం ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిస్తోంది. తమిళ ప్రేక్షకులు ఆదరిస్తే ఆ ప్రభావం టాలీవుడ్‌పై కూడా పడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సినిమా కృతి శెట్టికి మేక్ ఆర్ బ్రేక్ లాంటి ప్రాజెక్ట్‌గా చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా, కోలీవుడ్‌లో Jenny అనే మరో సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. అయితే ఈ సినిమా ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో, అది కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Recent Random Post:















