
కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌తో యష్ ఒక్కసారిగా స్టార్‌డమ్‌కి చేరుకుని, పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అంతకుముందు కన్నడ ఇండస్ట్రీలో మినిమమ్ బడ్జెట్ చిత్రాలకే పరిమితమైన ఆయన, ఈ సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించాడు. 2022లో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో దాదాపు రూ.1200 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఈ సినిమా చివర్లో కేజీఎఫ్ చాప్టర్ 3కి సంబంధించిన హింట్ ఇచ్చి మేకర్స్ భారీ హైప్ క్రియేట్ చేశారు. అయితే సినిమా ప్రకటించి మూడేళ్లు దాటినా, హోంబలే ఫిలిమ్స్, దర్శకుడు ప్రశాంత్ నీల్ లేదా హీరో యష్ నుంచి ఎలాంటి అధికారిక అప్డేట్ రాలేదు. ఈ మధ్యలో ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సలార్‌ను పూర్తి చేసి విడుదల చేయగా, ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కొత్త పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నారు.
యష్ కూడా ఈ మధ్య కాలంలో రిలాక్స్ మోడ్‌లో కనిపించినప్పటికీ, తర్వాత లేడీ డైరెక్టర్‌తో టాక్సిక్ అనే భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయంలో ఆయన రామాయణం చిత్రంలో రావణుడిగా నటిస్తూ నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా తెరకెక్కుతుండటంతో, యష్ షెడ్యూల్ చాలా బిజీగా మారింది.
ఈ కారణంగా కేజీఎఫ్ చాప్టర్ 3పై అభిమానులు ఆశలు పెట్టుకున్నప్పటికీ, యష్ తాజాగా ఇచ్చిన క్లారిటీతో ఇప్పట్లో ఆ సినిమా కష్టమనే సంకేతాలు వెలువడ్డాయి. వరుస ప్రాజెక్టుల కారణంగా డేట్స్ అందుబాటులో లేకపోవడంతో, ఈ సీక్వెల్ మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం టాక్సిక్ షూటింగ్ పూర్తి చేసి జూన్ 4న భారీ పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతున్నారు. అలాగే రామాయణం పార్ట్ 1 దీపావళికి, పార్ట్ 2 వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. ఈ బిజీ షెడ్యూల్ కారణంగా కేజీఎఫ్ 3పై నిర్ణయం ఇంకా మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది.
Recent Random Post:















