
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన Mythri Movie Makersలో సీఈవోగా వ్యవహరిస్తూ, సంస్థ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న చెర్రీ (అలియాస్ చిరంజీవి) ప్రస్తుతం మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఆయన స్వంతంగా స్థాపించిన Clap Entertainment బ్యానర్‌పై కూడా Mathu Vadalara, Happy Birthday, Mathu Vadalara 2, Jetlee వంటి చిత్రాలను నిర్మించారు.
Jetlee విడుదల సందర్భంగా మాట్లాడిన చెర్రీ, మైత్రీ మూవీ మేకర్స్ భవిష్యత్ ప్రాజెక్టులు Fauzi, Dragon గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అలాగే గత ఏడాది విడుదలైన Andhra King Taluka ఫలితంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆ సినిమా థియేట్రికల్ రన్ తనకు పెద్ద షాక్ ఇచ్చిందని చెర్రీ తెలిపారు. నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా మంచి ఆదాయం వచ్చినప్పటికీ, థియేటర్లలో వచ్చిన కలెక్షన్లు ఊహించని స్థాయిలో తక్కువగా ఉన్నాయని చెప్పారు. మంచి రివ్యూలు, పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న, మధ్యస్థాయి సినిమాలకు థియేటర్లలో ప్రేక్షకుల స్పందన తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా వినోదం ఖరీదైనదిగా మారడంతో ప్రేక్షకులు ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు.
థియేట్రికల్ రిలీజ్‌కు, డిజిటల్ రిలీజ్‌కు 8 వారాల గ్యాప్ అవసరమనే డిమాండ్ ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటీటీలు ఈ ఒప్పందానికి సిద్ధమే అయినప్పటికీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుందని, అది నిర్మాతలకు భారంగా మారుతుందని ఆయన అన్నారు.
ఇక హీరోలు పారితోషకం కాకుండా లాభాల్లో వాటా తీసుకోవాలనే విధానంపై చెర్రీ సానుకూలంగా స్పందించారు. సినిమా విజయంలో అందరూ భాగస్వాములు కావాలి కానీ నష్టాలు మాత్రం నిర్మాతలే భరించాలనడం న్యాయం కాదని ఆయన ప్రశ్నించారు.
Recent Random Post:















