చిరంజీవి బర్త్‌డే హంగామా – శ్రీకాంత్ ఓదెల ట్వీట్ వైరల్

Share


మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఘన హంగామా నెలకొంది. నిన్న సాయంత్రం విశ్వంభర ప్రాజెక్ట్‌తో మొదలైన ఉత్సాహం, ఈ రోజు శంకరవరప్రసాద్ టైటిల్ లాంచ్ మరియు బాబీ కాన్సెప్ట్ పోస్టర్ విడుదలతో మరింత ఉధృతమైంది. అయితే ఈ వేడుకల మధ్య, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేసిన ఒకే ఒక్క ట్వీట్ అభిమానుల్లో ప్రత్యేక చర్చకు కారణమైంది.

“నా చిరంజీవిని మిస్ అవుతూ వచ్చాను, నేను వెనక్కి తీసుకొస్తాను, ఇది రక్తంతో చేస్తున్న ప్రమాణం” అంటూ గూస్‌బంప్స్ కలిగించే పదాలతో ఆయన రాసిన సందేశం వైరల్‌గా మారింది. చిరంజీవితో సినిమా చేయడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమని, దానికంటే గొప్ప అవకాశం లేదని ఆయన చెప్పిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆయన ఫ్యానిజాన్ని స్పష్టంగా చూపించాయి. అంతేకాక, చిరంజీవితో తీసుకున్న ఫోటో చూసి తన తల్లి చిరునవ్వు పూయడం మొదటిసారి చూశానని చెప్పడం మరో భావోద్వేగ క్షణంగా మారింది.

ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. మార్చిలో ఈ చిత్రం విడుదలైన తర్వాత మెగా 159 ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి. నాని నిర్మాతగా వ్యవహరించే ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక, టెక్నికల్ టీమ్ ఫైనలైజేషన్ ఇంకా జరుగలేదు. సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరు వినిపిస్తున్నప్పటికీ ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కాబట్టి మెగా అభిమానులు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇంకో ఆరు నెలలు వేచి చూడాల్సి ఉంటుంది.


Recent Random Post: