
సాంప్రదాయ పాత్రల్లో ఎక్కువగా కనిపించే కీర్తి సురేష్ తాజాగా తన ఫ్యాషన్ స్టైల్ ను పూర్తిగా మార్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా చీరకట్టులో సింపుల్‌గా కనిపించే కీర్తి, తాజాగా ఓటీటీలో విడుదలైన ‘ఉప్పు కప్పురంబా’ సినిమా ప్రమోషన్స్‌లో తన లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా కీర్తి ధరించిన డ్రెస్ ఫ్యాషన్ లవర్స్‌కి హాట్ టాపిక్ అయ్యింది. డెనిమ్ కార్సెట్ టాప్‌తో కాటన్ బ్లూ చీర, తలనిండా మల్లె పూల జడ, గోల్డ్ బ్యాంగిల్స్, నెక్లెస్… ఇలా ట్రెడిషన్‌తో మోడర్న్ టచ్ కలిపి ఇచ్చిన షాక్‌కు సోషల్ మీడియా తెగ రెస్పాండ్ అవుతోంది. ఈ ఫ్యూజన్ లుక్‌లో కీర్తి చీరకట్టును స్టైలిష్‌గా ప్రెజెంట్ చేస్తూ సంప్రదాయానికి న్యాయం చేసింది.
నెటిజన్లు ఆమె లుక్‌పై,
‘‘సింపుల్ కీర్తి ఇంత గ్లామరస్‌గా మారడం ఒక మ్యాజిక్ లా ఉంది’’,
‘‘చీరలో గ్లామర్ కూడా ఇలా ఉంటుందా!’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ లుక్‌తో కీర్తి తనలోని ఫ్యాషన్ స్టేట్మెంట్కి కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇది కీర్తి కెరీర్లో ఒక ఫ్యాషన్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. చీరకట్టులోనూ గ్లామర్‌ని ఎలా చూపించాలో మిగతా హీరోయిన్స్‌కి కూడా ఒక ఉదాహరణగా నిలిచింది.
ప్రస్తుతం కీర్తి ‘రివాల్వర్ రీటా’ వంటి తమిళ సినిమాలతో పాటు, బాలీవుడ్ లో కూడా బిజీగా ఉంది. ఇక తెలుగులోనూ కొత్త ప్రాజెక్టుల కోసం చర్చలు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది.
Recent Random Post:















