
గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు కిరిటీ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా, రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జూనియర్. జెనీలియా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జూలై 18న grandగా విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
జూనియర్ గురించి మాట్లాడుతూ, “ఒక చిన్న కథను పెద్ద కాన్వాస్‌లో చెప్పే ప్రయత్నం చేశాం. హసిని పాత్రతో అందరి గుండెల్లో చోటు సంపాదించిన జెనీలియా మళ్లీ ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వడం చాలా స్పెషల్. జూనియర్ని కంబ్యాక్ మూవీగా ఎంచుకున్నందుకు ఆమెకు థ్యాంక్స్. జెనీలియా రాకతో సినిమాకు మంచి బ్రాండ్ వెల్యూ వచ్చింది. షూటింగ్ మొత్తం జెనీలియా నాకు అన్నివిషయాల్లో సహాయం చేసింది. మేకప్ విషయాల్లోనూ గైడ్ చేసింది” అని చెప్పింది శ్రీలీల.
తనకు “వైరల్ వయ్యారి” ట్యాగ్ రావడానికి దేవిశ్రీప్రసాద్ ప్రధాన కారణమని శ్రీలీల అన్నది. “ఒక పాట కంపోజ్ చేస్తే ఆ పని అయిపోతుంది అనుకుంటాం. కానీ డీఎస్పీ సెట్‌కి వచ్చి స్టెప్పులు ఇలా వేయండి, expressions ఇలా ఇవ్వండి అని ఎనర్జీ ఇస్తారు. అందుకే ఆయన రాక్ స్టార్. డీఎస్పీ వైరల్ అయితే, నేను వయ్యారి!” అంటూ ముచ్చటించింది.
డీఓపీ సెంథిల్ కుమార్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన శ్రీలీల, “ఎవరైనా బాధలో ఉన్నా ఆయనతో రెండు నిమిషాలు మాట్లాడితే చాలు, మనసు లైట్ అవుతుంది. ఆయన చుట్టూ ఒక డివైన్ ఆరా ఉంటుంది. షూటింగ్ చివరి రోజు ఆయన్ను వదిలి వెళ్లిపోవడం బాధగా అనిపించింది. ఎంత కష్టమైనా సెంథిల్ సర్ ఎంతో డెడికేషన్‌తో పని చేశారు. ఆయన మీద దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా” అని చెప్పింది.
Recent Random Post:















