టాలీవుడ్‌లో బిజీ అవుతున్న అందాల నిధి అగర్వాల్

Share


సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటూ వస్తోంది. పేరు తగ్గట్లే అందాల నిధిగా అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 30 మిలియన్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నా, ఇండస్ట్రీలో పెద్దగా సినిమాలు చేయకపోవడం ఆశ్చర్యకరం.

2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి సక్సెస్ సాధించినప్పటికీ, ఆ తర్వాత వరుసగా అవకాశాలు రాకపోవడంతో ఆమె కెరీర్ ఊహించినంత వేగం అందుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు నిధి అగర్వాల్ చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వచ్చే నెలలో విడుదల కాబోతున్న హరి హర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో తన పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అంతేకాదు, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాలో కూడా నిధి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కూడా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇప్పుడీ రెండు భారీ సినిమాలతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారబోతున్న నిధి అగర్వాల్‌పై అభిమానుల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ, హాట్ టాపిక్‌గా మారుతున్న ఈ అమ్మడికి ఈ ఏడాది ఖచ్చితంగా పెద్ద బ్రేక్ దక్కుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అందమైన ఫిజిక్‌తో పాటు ఆకర్షణీయమైన అందంతో స్టార్ హీరోయిన్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నా, ఇంకా సరైన బ్రేక్ రాకపోవడం ఆమె అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. అయితే, త్వరలోనే ఈ అమ్మడికి టాలీవుడ్‌లో గోల్డెన్ టైమ్ మొదలవుతుందని ఆశిస్తూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

మరి రాబోయే సినిమాలతో ఈ అందాల నిధి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదిస్తుందో లేదో చూడాలి.


Recent Random Post: