టీ సిరీస్‌పై అనురాగ్ కశ్యప్ ఘాటు వ్యాఖ్యలు!

Share


సూటిగా మాట్లాడే వ్యక్తిగా పేరున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి బాలీవుడ్ మీద నిప్పులు చెరిగాడు. బాలీవుడ్‌లో ఉన్న విష సంస్కృతి కారణంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు ఇండస్ట్రీని వదిలి వెళ్ళారని, తానూ ఇక మళ్లీ బాలీవుడ్‌లోకి తిరిగి రావడం లేదని తేల్చేశారు.

ఇటీవల అనురాగ్, ప్రముఖ ఆడియో కంపెనీ టీ సిరీస్‌పై గట్టిగానే విమర్శలు చేశారు. తాను రూపొందించిన దేవ్ డి, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, గులాల్ వంటి సినిమాల పాటలకు సరైన ఆడియో హక్కుల ధర చెల్లించలేదని ఆరోపించారు. అదే బాంబే వెల్వెట్ చిత్రానికి మాత్రం పెద్ద మొత్తంలో చెల్లించారని, అయితే ఆ చిత్ర సంగీతం ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదని పేర్కొన్నారు.

టీ సిరీస్ వారు స్టార్ పవర్‌ ఆధారంగా మాత్రమే ఆడియో హక్కుల ధరలు నిర్ణయిస్తారని, వారికి మంచి సంగీతం గురించి సరైన అర్థం లేదని అనురాగ్ తీవ్రంగా వ్యాఖ్యానించాడు. పాటలకు తగిన విలువ చెల్లించాలని, అభిరుచితో వ్యవహరించాల్సిందని తన మాటల్లో ఆవేదన వ్యక్తమయ్యింది.

ప్రస్తుతం అనురాగ్ డెబ్బాయిట్ అనే టాలీవుడ్ చిత్రంలో, వన్ టు వన్ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నాడు. దశాబ్ద కాలంగా దృష్టి పెట్టిన దర్శక వ్యాసంగానికి తాత్కాలికంగా విరామం ఇచ్చినట్టు సమాచారం.


Recent Random Post: