డిజాస్టర్‌లను తప్పించుకున్న దుల్కర్‌ — లక్కీయెస్ట్ హీరో!

Share


దుల్కర్ సల్మాన్ — మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ టాలెంటెడ్ హీరో. కానీ తన నటనతో దక్షిణాది భాషలకే పరిమితం కాకుండా ఉత్తరాది ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటూ సౌత్ ఇండియన్ స్టార్‌గా ఎదిగాడు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ, భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అన్ని భాషల్లో భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు.

తెలుగులో వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ ఇటీవల విడుదలైన లక్కీ భాస్కర్ మూవీతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టాడు. ఈ విజయంతో హీరోగా మరో మెట్టు ఎక్కాడు. ప్రస్తుతం తెలుగు, మలయాళ భాషల్లో మూడు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. కాంత, ఆకాశంలో ఒక తార, మలయాళంలో ఐ యామ్ గేమ్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఐ యామ్ గేమ్ చిత్రానికి ఆయన నిర్మాత కూడా.

ఇక తాజాగా దుల్కర్‌పై “లక్కీయెస్ట్ ఫెల్లో” అనే ముద్ర పడింది. అందుకు కారణం రెండు భారీ ఆఫర్లను తెలివిగా తిరస్కరించి అనవసరమైన డిజాస్టర్ల నుంచి బయటపడటం.

మొదట, శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ్ చేసిన పాత్రకు శంకర్ మొదట దుల్కర్‌ను సంప్రదించారట. కానీ ఆ పాత్ర చేయడానికి ఆసక్తి లేకపోవడంతో, దుల్కర్ సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

ఆ తరువాత మణిరత్నం – కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన థగ్ లైఫ్ సినిమా నుంచి కూడా ఆహ్వానం అందింది. ఇందులో శింబు పోషించిన కీలక పాత్రను ముందుగా దుల్కర్‌కు ఆఫర్ చేసినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ కూడా దుల్కర్ మర్యాదపూర్వకంగా వదులుకున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా కూడా భారీ పరాజయం పాలైంది.

ఈ విధంగా వరుసగా రెండు డిజాస్టర్ ప్రాజెక్ట్స్ నుంచి బయటపడిన దుల్కర్‌ను అభిమానులు, పరిశ్రమ వర్గాలు “లక్కీయెస్ట్ ఫెల్లో” అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


Recent Random Post: