
తండ్రి మోహన్ బాబుకు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు, గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
జూన్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుండగా, ప్రమోషన్స్‌లో విష్ణు పూర్తిగా బిజీగా ఉన్నారు. ప్రమోషన్ ఈవెంట్స్‌లో భాగంగా, ఆయన సినిమా సంబంధిత విషయాలతో పాటు తన పర్సనల్ ఆసక్తుల గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడుతున్నారు.
ఒక ఇంటర్వ్యూలో “మీరు డైరెక్షన్ వైపు వెళ్లాలనుకుంటారా?” అనే ప్రశ్నకు స్పందించిన విష్ణు, ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
తాను ఓ రోజు డైరెక్టర్ అయితే, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను డైరెక్ట్ చేయడం తన చిరకాల కోరిక అని వెల్లడించారు.
అమితాబ్ బచ్చన్ నటనపై తనకున్న అభిమానాన్ని పంచుకుంటూ, “గతేడాది వచ్చిన ‘కల్కి’ సినిమాలో ఆయన పోషించిన అశ్వత్థామ పాత్ర నాకు విపరీతంగా నచ్చింది. దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న ఆదరణ అసాధారణం,” అంటూ ప్రశంసలు కురిపించారు.
ప్రస్తుతం విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక ‘కన్నప్ప’ విషయానికి వస్తే –
ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు విష్ణు తిన్నడు పాత్రలో నటించారు.
మోహన్ బాబు నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
భారీ బడ్జెట్, హై వాల్యూ క్యాస్టింగ్‌తో తెరకెక్కిన ‘కన్నప్ప’పై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా విజయంపై మంచు విష్ణు పూర్తి నమ్మకంతో ఉన్నారు.
Recent Random Post:















