
బాలీవుడ్ యాక్షన్ కింగ్‌గా, హీమ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న లెజెండరీ నటుడు ధర్మేంద్ర ఆరోగ్య స్థితి గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నారని సమాచారం. అయితే ఇవాళ ఉదయం నుంచి ఆయన మరణించారనే వార్తలు విస్తృతంగా పాకడంతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అయితే ఈ గాసిప్స్ మధ్యలోనే ధర్మేంద్ర కూతురు ఈషా డియోల్ ఇచ్చిన స్పందనతో అసలైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ —
“మా నాన్న చనిపోయారు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుడు సమాచారం. దయచేసి ఎవరూ ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. ఆయన బాగానే ఉన్నారు,” అని స్పష్టం చేసింది.
దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్విస్ట్ వచ్చింది. ఉదయం నుంచి వచ్చిన రూమర్లను నమ్మిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, “జీవించి ఉన్న వ్యక్తిని చంపేశారు కదా!” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ వార్తలపై ధర్మేంద్ర భార్య, ప్రముఖ నటి హేమమాలిని కూడా స్పందిస్తూ —
“ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం క్షమించరాని విషయం. ఆయన చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారు. బాధ్యతారహితంగా ఇలా ఫేక్ న్యూస్ పంచడం చాలా తప్పు. దయచేసి మా కుటుంబ గోప్యతకు గౌరవం ఇవ్వండి,” అంటూ ట్వీట్ చేశారు.
తాజా సమాచారం ప్రకారం, 89 ఏళ్ల ధర్మేంద్ర ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. గత వారం సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరగా, భార్య హేమమాలిని, కుమారుడు సన్నీ డియోల్, ఇతర కుటుంబ సభ్యులు సందర్శించారు. అలాగే సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి బాలీవుడ్ తారలు కూడా ఆయనను పరామర్శించారని తెలుస్తోంది.
Recent Random Post:















