తెలుగు సినిమాల్లో తమ సినిమాలకు రాజ ముద్ర వేసుకునే డైరెక్టర్ ఒకే ఒక్కడు అతనే దర్శక ధీరుడు రాజమౌళి. ఇట్స్ ఏ రాజమౌళి ఫిల్మ్ అని రాజ ముద్ర పడింది అంటే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే లెక్క. తన ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన ఆర్.ఆర్.ఆర్ వరకు రాజమౌళి సినిమా అంటే చాలు బ్లాక్ బస్టర్ హిట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఐతే రాజమౌళి రాజ ముద్ర లానే హీరోల్లో నాని కూడా ఒక మార్క్ సెట్ చేస్తున్నాడు.
అదేంటి నాని సినిమాల్లో అలాంటి రాజ ముద్ర కనిపించదు కదా అనుకోవచ్చు. రాజమౌళిలా సినిమా చివర్లో ముద్ర వేయడు కానీ నాని సినిమాలు చూస్తే అది తెలుస్తుంది. ఏ హీరో అయినా కొత్త వారితో ప్రయోగాలంటే కెరీర్ రిస్క్ అనుకుని సైడ్ అయిపోతారు. కానీ నాని మాత్రం అలాంటి రిస్క్ లు కేక్ వాక్ అనేలా చేస్తుంటాడు. తెలుగు సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్స్ ని పరిచయం చేయాలని ఒక యజ్ఞం కొనసాగిస్తున్నాడు నాని. అందుకే అతను ప్రతి సినిమాకు ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ సత్తా చాటుతున్నాడు.
అంతేకాదు టాలెంట్ ఉండి వారికి ఒక ఛాన్స్ ఇద్దామనుకున్న డైరెక్టర్స్ కి కూడా నాని అవకాశం ఇస్తున్నాడు. లేటెస్ట్ గా సరిపోదా శనివారం సినిమాతో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ టాలెంట్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పేలా చేశాడు నాని. అంతకుముందు కెరీర్ లో నాని పడిన స్ట్రగుల్ అంతా చూసి వచ్చాడు కాబట్టి అలా స్టోరీ టెల్లింగ్ లో కసి ఉన్న దర్శకులను ఏరుకుని మరీ వారితో హిట్లు సూపర్ హిట్లు చేస్తున్నాడు.
లాస్ట్ ఇయర్ దసరాతో బ్లాక్ బస్టర్ 100 కోట్లు అందుకున్న నాని ఆ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడిని పరిచయం చేశాడు. ఇయర్ ఎండింగ్ లో హాయ్ నాన్నతో మరో సెన్సిబుల్ డైరెక్టర్ శౌర్యువ్ ని అందించాడు. సరిపోదా శనివారంతో వివేక్ అసలు స్టామినా ఇది అని ప్రూవ్ చేశాడు. సో నాని తో సినిమా చేస్తున్న దర్శకులు టాలీవుడ్ సినిమాను కొత్త కథలతో ముందుకు తీసుకెళ్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో అలాంటి వారికి మొదటి ఛాన్స్ ఇచ్చి తన ముద్ర పడేలా చేస్తున్నాడు నాని.
Recent Random Post: