పరేష్ రావల్ షాక్: హేరా ఫేరీ 3 నుంచి తప్పుకోగా లీగల్ నోటీసు!

Share


ఖిలాడీ అక్ష‌య్ కుమార్, ప్రియదర్శన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ హిందీ కామెడీ ఫ్రాంఛైజీ ‘హేరా ఫేరీ 3’ ప్రీప్రొడక్షన్ దశలోనే భారీ డ్రామాను ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో మునుపటి భాగాల్లా అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, ప‌రేష్ రావ‌ల్ కాంబో తిరిగి స్క్రీన్‌పై కనిపిస్తారనే అంచనాలు బలంగా ఉండగా, ఇప్పుడు ఆశ్చర్యకరంగా ప‌రేష్ రావ‌ల్ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

‘బాబు భయ్యా’ అనే పాత్రలో తన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప‌రేష్ రావ‌ల్ లేకుండా ఈ సిరీస్‌ ఊహించలేనని అభిమానులే కాకుండా చిత్రబృందం కూడా భావించినప్పటికీ, ఆయన ఆకస్మికంగా ప్రాజెక్ట్ నుంచి వైదొలగడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మొదటగా సృజనాత్మక విభేదాలే ఈ నిర్ణయానికి కారణమని వార్తలు రాగా, తానే స్వయంగా ఆ ప్రచారాన్ని ఖండించారు ప‌రేష్. “క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏవీ లేవు,” అంటూ క్లారిటీ ఇచ్చారు. అయినా, ఈ నిర్ణయం సరైనదికాదని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం, అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ప‌రేష్ రావ‌ల్‌కు రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు పంపింది. చిత్రబృందం ఆరోపణల ప్రకారం, ప‌రేష్ రావ‌ల్ ఈ సినిమా కోసం జరిగిన అన్ని కీలక సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ, చివరి సమయంలో దర్శకనిర్మాతల‌కు చెప్పకుండానే ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడం కారణంగా నిర్మాణానికి నష్టం జరిగిందని చెబుతున్నారు.

ఈ పరిణామాల మధ్య ‘హేరా ఫేరీ 3’కు మరో బాబు భయ్యా replacement ఉంటాడా? లేక ప‌రేష్ రావ‌ల్ తిరిగి జట్టులోకి వచ్చిపోతారా అన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. అభిమానులు మాత్రం “బాబు భయ్యా లేకుండా హేరా ఫేరీ కాదు” అని గట్టిగానే అభిప్రాయపడుతున్నారు.


Recent Random Post: