
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న OG సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి అభిమానులు మాత్రమే కాక, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై పవన్ కళ్యాణ్ ను చూడగలం అని ఫ్యాన్స్ అతి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
సినిమా దసరా సందర్భంలో, సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. మేకర్స్ వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఓవర్సీస్ ప్రీమియర్స్ కోసం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడై ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచాయి. ప్రీమియర్స్ ప్రీ-బుకింగ్స్‌తోనే కొత్త రికార్డులు సృష్టించబడుతున్నాయి. పాత రికార్డులు కుప్పకూలుతున్నాయి.
అమెరికాలో OG ప్రీమియర్ షోల కోసం ఇప్పటికే 50,000 టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్‌లో అమ్ముడై ఉన్నాయి. రిలీజ్‌కు ఇంకా 10 రోజులు ఉన్నప్పటికీ ఈ రికార్డ్ సాధించడం అసాధారణం. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా 50,000 టిక్కెట్లు అమ్ముడయ్యే తెలుగు సినిమాగా OG నిలిచింది. ఫ్యాన్స్ దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో, పవన్ కళ్యాణ్ తన గత చిత్ర అజ్ఞాతవాసి రికార్డును కూడా తానే పక్కగట్టారు. అజ్ఞాతవాసి ఉత్తర అమెరికా ప్రీమియర్ వసూళ్లలో $1.51 మిలియన్లతో రికార్డు సృష్టించగా, ఇప్పుడు OG రిలీజ్‌కు 10 రోజులు మిగిలి ఉండగానే ఆ రికార్డును బ్రేక్ చేసి సత్తా చాటింది. ప్రీ-సేల్స్‌తోనే OG పవన్ కళ్యాణ్‌కు ఉత్తర అమెరికాలో అత్యధిక ప్రీమియర్ వసూళ్లు తెచ్చిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం సినిమా $2 మిలియన్ డాలర్ క్లబ్ వైపు పరుగులు పెడుతోంది.
ప్రోమోషనల్ కంటెంట్, ముఖ్యంగా సెప్టెంబర్ 18న విడుదల కానున్న ట్రైలర్, సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తే ప్రీమియర్ల ద్వారా $3.5 మిలియన్ వరకు వసూళ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు, త్వరలోనే అధికారిక ప్రకటన రావడం ఖాయం.
Recent Random Post:















