
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సినీ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద చర్చకేస్కొచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా, ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసారా? అంటూ పవన్ మీడియా ముందుకు వచ్చారు. కూటమి వ్యక్తుల్ని కాదు.. సినిమా రంగ అభివృద్ధే తమకు ముఖ్యం అని స్పష్టంగా తెలిపారు.
“మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్‌ను తగిన రీతిలో స్వీకరిస్తా. ఇకపై వ్యక్తిగత విజ్ఞాపనలు లేవు. సంబంధిత శాఖల ప్రతినిధులతోనే చర్చలు జరుగుతాయి,” అని పవన్ తేల్చిచెప్పారు. ఇటీవల కొంతమంది ప్రముఖ నిర్మాతలు పవన్‌ను కలిసిన సందర్భంగా, “అందరూ కలిసి రావాలి” అన్న పిలుపుకూ స్పందన లేకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, పవన్ వ్యాఖ్యలకు ముందు ఫిల్మ్ ఛాంబర్ నుంచి “థియేటర్లు మూసే ఆలోచన లేదు” అనే ప్రకటన రావడం గమనార్హం. అయినప్పటికీ, పవన్ స్పష్టమైన స్టాండ్ తర్వాత కూడా టాలీవుడ్ ప్రముఖులు మౌనమే ఉంటుండడం ఆసక్తికరంగా మారింది. నలుగురు నిర్మాతల ఆధిపత్యం వల్లే ఇండస్ట్రీ ఈ స్థితికి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఆ వాదనను ఖండించాలంటే నిర్మాతలు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
పవన్ ప్రెస్ నోట్‌కి వెంటనే నిర్మాతలు నాగవంశీ, బన్నీ వాస్ స్పందించారు. అనంతరం అల్లు అరవింద్ స్పందిస్తూ – “ఆ నలుగురిలో నేను లేను, ఇటీవల ఏ మీటింగ్‌కి నేను వెళ్లలేదు” అని స్పష్టంగా చెప్పారు. తాజాగా దిల్ రాజు కూడా స్పందిస్తూ, తమ గ్రూప్ దగ్గర 30 థియేటర్లే ఉన్నాయని తెలిపారు. “ఆ నలుగురు… ఆ నలుగురు అంటున్నారు కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను” అన్నారు.
ఈ పరిస్థితుల్లో ఊహాగానాలకు ముగింపు పలకాలంటే నిర్మాతలందరూ మీడియా ముందుకు రావడం అవసరం. సమస్యలకు స్నేహపూర్వక పరిష్కారం వెతకాలని పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఆలోచించాల్సిన సమయం ఇది. అయితే, ఇప్పటివరకు మరెవ్వరూ ఓపెన్‌గా స్పందించకపోవడం పరిశ్రమలోని మౌన రాజకీయాల్ని బయటపెడుతోంది.
Recent Random Post:















