
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నిధి అగర్వాల్, ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయినా, కోలీవుడ్‌లో మాత్రం వరుస అవకాశాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె నటించిన హరి హర వీరమల్లు సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా నిధి తన అనుభవాలను పంచుకుంటూ, పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
“పవన్ కళ్యాణ్ గారితో పని చేయడం నా లైఫ్‌లో లక్కీ ఛాన్స్. ఆయన ఎలాంటి స్టార్ ఉన్నా కూడా చాలా సింపుల్. ఆయనతో ఒక సినిమా చేయడం వేరే వంద సినిమాలు చేసినంత ఆనందం ఇచ్చింది” అంటూ నిధి చెప్పింది.
నిధి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ సాహిత్యం, జ్ఞానం, వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా ప్రశంసించింది. ఆయనతో పనిచేసే సమయంలో ఎంతో నేర్చుకున్నానని చెప్పింది. అదృష్టవశాత్తు నిధికి పవన్ కళ్యాణ్, ప్రభాస్ అనే టాప్ హీరోలతో నటించే అవకాశం ఒకేసారి దక్కింది. రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ సరసన నిధి నటించింది.
నిధి మాట్లాడుతూ,
“పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇద్దరూ ఎంత పెద్ద స్టార్స్ అయినా కూడా ఎంతో హంబుల్‌గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు. ఆయన పాత్రలో సజీవంగా మారిపోతారు. ప్రభాస్ అయితే నిజంగానే డార్లింగ్. ఆయనతో చేసే సినిమా వంద సినిమాల కంటే గొప్పది” అంటూ చెప్పుకొచ్చింది.
నిధి అగర్వాల్ నటించిన హరి హర వీరమల్లు, రాజా సాబ్ సినిమాలు హిట్ అయితే, ఆమెకు మళ్లీ తెలుగులో పునరాగమనానికి మంచి అవకాశాలు దక్కే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
Recent Random Post:















