శంకర్ సినిమా అంటే? బడ్జెట్ తడిపి మోపుడవుతుందన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఒకసారి సెట్స్ కి వెళ్లిన తర్వాత శంకర్ రాజీ పడరు. తాను అడిగినవన్నీ సమకూర్చాల్సిందే. నిర్మాణ పరంగా ప్రతీది రిచ్ గా ఉండాలని చూస్తారు. వేసే సెట్స్ దగ్గర నుంచి ..నటీనటుల వరకూ ప్రతీది భారీ కాన్వాస్ పైనే ఉంటుంది. ఆయన ఏ సినిమా చేసిన భారీ సెట్లు తప్పనిసరి. ముఖ్యంగా పాటల కోసం ఆయన కోంస ఆయన వేయించే సెట్లు చూస్తే దిమ్మతి రిగిపోతుంది.
కోట్ల రూపాయలు ఆ సెట్స్ కే ఖర్చు చేస్తారనిపిస్తుంది. ఆయన తీసుకున్న కథాంశం ఎలాంటిదైనా? పాటల సెట్స్ విషయంలో మాత్రం రాజీ పడరు. శంకర్ డైరీలో ఇదో రూల్ లాంటింది. ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన సినిమాలు తిరగేస్తే సంగతి అర్దమవుతుంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో `గేమ్ ఛేంజర్` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లిరికల్ సింగిల్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ఈసినిమాలో ఓ సె ట్స్ కోసం ఏకంగా 20 కోట్లు ఖర్చు చేసారుట.
కేవలం ఒక పాట సెట్ కోసమే అన్ని కోట్లు ఖర్చు చేసినట్లు వినిపిస్తుంది. అది ఓ మెలోడీ సాంగ్ అంట. సాధారనంగా మెలోడీ సాంగ్స్ అంటే సన్నివేశంలో భాగంగా చుట్టేస్తుంటారు. పెద్దగా ఖర్చు లేకుండా మేకర్స్ తెల్చేస్తుంటారు. కానీ శంకర్ ఆ మెలోడీ సాంగ్ విషయంలో రాజీ పడనట్లు తెలుస్తోంది. 20 కోట్ల ఖర్చుతో భారీ సెట్…కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించి ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అయితే శంకర్ చేసిన ఖర్చు అన్నది ప్రతీ పాటలోనూ…ప్రేమ్ లోనూ స్పష్టగా కనిపిస్తుంది.
ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభూతిని ఇవ్వడంలో ఆయన ప్రత్యేకత వేరు. తన పాటల సెట్లతోనే కొన్ని నిమిషాల పాటు ఆయన వరల్డ్ లోకి తీసుకెళ్తారు. ఇది కేవలం శంకర్ మాత్రమే సాధ్యం. గేమ్ ఛేంజర్ ని దిల్ రాజు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకుగా రిలీజ్ అవుతుంది.
Recent Random Post: