పిల్ల‌ల విష‌యంలో రేణు దేశాయ్ ఎందుక‌లా?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలుపుతో విషెస్ తో సోషల్ మీడియా హోరెత్తిన సంగ‌తి తెలిసిందే. గెలుపుకు ముందు నుంచే ఈ వాతావ‌ర‌ణం మొద‌లైంది. ఇక గెలుపు త‌ర్వాత అభిమానుల ఆనందానికి అవ‌దుల్లేవ్. త‌మ‌దైన శైలిలో ప‌వ‌న్ గెలుపును ఆస్వాదిస్తున్నారు. మెగా ఫ్యామిలీ అంత‌కు మించిన ఆనందంలో క‌నిపిస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ రాజ‌కీయాల్లో కొత్త చ‌రిత్ర రాయ‌బోతున్నారంటూ అంతా గెస్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అదే జోష్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ -రేణు దేశాయ్ ల కుమారుడు అకీరా నంద‌న్ తండ్రి విజ‌యాన్ని ఉద్దేశించి `సెల్యూట్ ది కెప్టెన్ ` అంటూ పవన్ కళ్యాణ్ ఫొటోను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టాడు.

త‌న ప్రౌడ్ మూవ్ మెంట్ ని ఆ ర‌కంగా అభిమానుల‌తో పంచుకున్నాడు. అయితే ఆ ఫోటోను రేణు దేశాయ్ త‌న ఇన్ స్టాలో షేర్ చేస్తూ ` నాన్న‌పై అకీరా పోస్ట్ అంటూ ఓ క్యాప్ష‌న్ ఇచ్చారు. కానీ ఇందులో ఎక్క‌డా అకీరా ఇన్ స్టా ఐడీని క‌నిపించ‌కుండా బ్ల‌ర్ చేసారు. ఇలా ఐడీ బ్ల‌ర్ చేయ‌డం రేణ్ దేశాయ్ గ‌తంలో కూడా చేసారు. కుమార్తె ఆద్య పోస్ట్ ను కూడా ఇలాగే షేర్ చేసి ఆమె ఐడీని బ్ల‌ర్ చేసారు. దీంతో రేణు దేశాయ్ ఎందుకిలా ఐడీలు బ్ల‌ర్ చేస్తున్నారంటూ చ‌ర్చ సాగుతుంది. అయితే పిల్ల‌ల ఇద్ద‌రికి సంబంధించి పూర్తిగా ప్రైవ‌సీ ఉండాల‌నే? వాళ్ల వివ‌రాలు ఎవ‌రికీ తెలియ‌కుండా ఉండాల‌నే రేణ్ దేశాయ్ ఇలా చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. వాళ్ల ఆఫీషియ‌ల్ ఐడీలు ఫ్యాన్స్ లోకి వెళ్తే చ‌ర్చ‌కు అవ‌కాశం ఉంటుంది.

వాటితో ఎలాంటి ఇబ్బందులుంటాయో కూడా రేణు దేశాయ్ కి తెలుసు. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల నుంచే రేణు దేశాయ్ ఎన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కున్న సంగ‌తి తెలిసిందే. పొర‌పాటున కూడా పిల్ల‌ల విష‌యంలో అలాంటి త‌ప్పిదాలు ఎక్క‌డా జ‌ర‌గ‌కూడ‌ద‌నే పూర్తిగా ప్రైవ‌సీ కోసం ఇలా చేసిన‌ట్లు చ‌ర్చ సాగుతుంది. ఇక అకీరా ఎంట్రీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌కంటే రాజ‌కీయాల్లోనే ఎక్కువ‌గా బిజీగా ఉంటారు. ఆ లోటును భ‌ర్తీ చేయాలంటే అకీరా మ్యాక‌ప్ వేయాల్సిందేన‌ని అభిమానులంతా భావిస్తున్నారు. కానీ అందుకు ఇంకా చాలా స‌మ‌యం ఉంది. ప్ర‌స్తుతం అకీరా నంద‌న్ వ‌య‌సు 20 ఏళ్లే. చ‌దువు పూర్త‌వ్వాలి. ఆ త‌ర్వాత తాను హీరో అవ్వాల‌నుకుంటున్నాడా? ఇంకేదైనా ప‌నిలో రాణించాల‌నుకుంటున్నాడా? అన్న దానిపై క్లారిటీ వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కూ అభిమానులు ఇలా ఖుషీ అవ్వాల్సిందే.


Recent Random Post: