
రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” లాంటి ఫ్లాప్ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో “పెద్ది” సినిమా మీద కొంత అనుమానం ఉండటం సహజమే. కానీ ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండటంతో పాటు, చరణ్ లుక్ “రంగస్థలం”లోని చిట్టిబాబును గుర్తు చేస్తుండటంతో అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవలే విడుదలైన “పెద్ది” ఫస్ట్ షాట్ ఈ క్రేజ్ ని మరింత రెట్టింపు చేసింది.
డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా రిలీజ్‌కి ఇంకా సంవత్సరమే ఉన్నప్పటికీ ఇప్పటినుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. మొదటి గ్లిమ్స్ ద్వారా ప్రేక్షకుల్లో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు. “గేమ్ ఛేంజర్” ని అందరూ మర్చిపోయి మళ్లీ చరణ్‌కి “ఆర్ఆర్ఆర్” తరహా విజయాన్ని అందించగల సినిమా ఇదేనన్న ఆశాభావం పెరిగింది.
ఫస్ట్ షాట్‌కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే చరణ్ ఖచ్చితంగా మరో హిట్ అందుకుంటాడనే నమ్మకం ఏర్పడింది. దీంతో బుచ్చిబాబు మేకింగ్ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరోవైపు అప్పుడప్పుడూ స్టిల్స్, పోస్టర్స్ విడుదల చేస్తూ సినిమాపై హైప్ కొనసాగించే పనిలో పడ్డాడు.
“పెద్ది” సినిమాను బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్న ప్రమోషన్ స్ట్రాటజీ బాగుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్‌కి ముందే ఈ స్థాయిలో క్యూరియాసిటీ పెరగడం సినిమాకు ప్లస్ అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం.
Recent Random Post:














