
సందీప్ రెడ్డి వంగా మేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో తన క్రాఫ్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పటికే నిరూపించేశాడు. హీరో క్యారెక్టర్ ఆధారంగా కథను నడిపిస్తూ, ఆ పాత్ర ద్వారా తన ఆలోచనను బలంగా ప్రేక్షకుల మదిలో నిలిపే న్యూ ఏజ్ మేకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి లాంటి దిగ్గజాలు కూడా ఆయనపై ప్రశంసలు కురిపించారు.
ఇప్పుడు అలాంటి క్రియేటివ్ మైండ్‌కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోడవుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘స్పిరిట్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ రోల్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో అనే హింట్‌ను ఇప్పటికే సందీప్ ఇచ్చేశాడు. “రెండు రేర్ డ్రగ్స్‌ని కలిపితే వచ్చే కిక్‌లా ప్రభాస్ పాత్ర ఉంటుంది” అని చెప్పడంతో, ఈ సినిమా హీరో క్యారెక్టర్ ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’లోని పాత్రలను మించి ఉంటుందని అభిమానులు నమ్ముతున్నారు.
సందీప్ సినిమాల్లో మామూలు డైలాగులు, ఎలివేషన్ పంచ్‌లు ఉండవు. కానీ హీరోకి ఒక కొత్త యాటిట్యూడ్‌ని ఇస్తాడు. అదే ఆయన ప్రత్యేకత. ఈసారి ప్రభాస్‌కి ఏ రేంజ్ యాటిట్యూడ్ ఇస్తాడో అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపించడం ఖాయమైంది. ఆ పాత్ర ద్వారానే సందీప్ తన స్టైల్‌లో సిస్టమ్‌ని, ఆఫీసర్ అటిట్యూడ్‌ని హైలైట్ చేయనున్నాడు.
త్వరలోనే సినిమా సెట్స్‌కి వెళ్లబోతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు సందీప్‌కి రిక్వెస్ట్‌లు చేస్తున్నారు. “బాస్ కంటెంట్ కం కటౌట్‌తో మెంటల్ ఎక్కిపోవాలి” అంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో, ఆ పాత్ర ఎంత శక్తివంతంగా ఉంటుందో అన్న ఊహల్లోనే ఫ్యాన్స్ ఇప్పుడే మునిగిపోయారు.
అయితే ఈ అంచనాలన్నింటినీ ఎలా తీర్చుతాడు అనేది ఇప్పుడు సందీప్‌పై ఉన్న పెద్ద సవాల్. కానీ ఆయన స్టైల్‌ను బట్టి చూస్తే, ఒత్తిడికి లోనై వెనక్కి తగ్గే వారిలో కాదని, “చినగిపోవడం కాదు… తగలబెట్టేద్దాం” అన్నట్టే దూసుకెళ్తాడని అభిమానులు నమ్ముతున్నారు.
Recent Random Post:















