మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.
విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా విశ్వంభర యూనిట్ సభ్యులు మాత్రం స్పీడ్ గా చిత్రీకరణ చేస్తున్నారు. మొన్నటి వరకు పాట చిత్రీకరణ చేసిన టీం ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా వెంటనే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ మొదలు పెట్టారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. అక్కడ బురద నీరు, దుమ్ములో విశ్వంభర యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. చిరంజీవి ఒంటి నిండ బురదతో పాటు, దుమ్ములో చాలా ఇబ్బంది పడుతున్నారట. అయినా కూడా డూప్ లేకుండానే చిరు ఈ ఫైటింగ్ సీన్ చేస్తున్నారట.
చిరంజీవి కావాలి అనుకుంటే డూప్ పెట్టి బురద సన్నివేశాలను మేనేజ్ చేయగలరు. కానీ చిరంజీవి తానే స్వయంగా చేయాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవ్వాలనే ఉద్దేశ్యంతో బురద లో కష్టమైనా కూడా యాక్షన్ సన్నివేశాలను చిరంజీవి చేస్తున్నారు.
బింబిసార చిత్రం తర్వాత దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ను భారీ ఎత్తున రూపొందిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు స్టార్స్ కనిపించబోతున్న ట్లు సమాచారం అందుతోంది.
Recent Random Post: