బాలయ్య ‘అఖండ 2’ కోసం భారీ రెమ్యూనరేషన్

Share


గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో అగ్రగామిగా దూసుకుపోతున్నాడు. ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య, తాజాగా బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘డాకు మహారాజ్’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస విజయాలతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ప్రస్తుతం బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’లో తాండవం చేయబోతున్నాడు. బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘అఖండ’కు ఇది సీక్వెల్ కావడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంటేనే మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు. ఈ క్రేజీ కాంబో నుంచి వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు అదే జోడీ ‘అఖండ 2’ కోసం మరోసారి చేతులు కలిపింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బోయపాటి ఈ సీక్వెల్ స్క్రిప్ట్‌ను నెక్ట్స్ లెవెల్‌లో రూపొందించారని, అందులో గూస్‌బంప్స్ వచ్చే ఎలిమెంట్స్ మరింత పెంచారని టాక్. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాలయ్య ఈ సినిమాకు తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేశాడట. ఇప్పటివరకు రూ.28 కోట్లు తీసుకుంటున్న బాలయ్య, ‘అఖండ 2’ కోసం ఏకంగా రూ.35 కోట్ల వరకు పెంచారని సమాచారం. బాలయ్య మార్కెట్, విజయ పరంపర చూసిన నిర్మాతలు కూడా ఈ రెమ్యూనరేషన్‌కి సుముఖంగా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇటీవల బాలయ్య, సంగీత దర్శకుడు తమన్‌కు ఓ లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే. గత నాలుగు సినిమాలుగా తమన్-బాలయ్య కాంబో సక్సెస్‌ను చూసిన బాలయ్య, తమన్ పనితనాన్ని మెచ్చుకుని ఈ ఖరీదైన బహుమతిని ఇచ్చాడు. అయితే, బాలయ్య తన రెమ్యూనరేషన్‌లోంచే ఆ కారును కొన్నాడంటూ టాలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది, కానీ ‘అఖండ 2’ మాత్రం మరో బిగ్ హిట్‌గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


Recent Random Post: