2008 లో హిందీ మరియు తెలుగు లో ఒకేసారి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్. నటిగా కంటే కూడా తన అందాల ఆరబోత కారణంగా ఎక్కువగా వార్తల్లో నిలవడంతో పాటు, అందంగా కనిపించడం వల్ల ఎక్కువ ఆఫర్లు దక్కించుకున్న ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా ఇంకా కూడా అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే ఉంది.
తెలుగు లో బాలయ్య తో లెజెండ్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. రామ్ తో కలిసి పండగ చేస్కో సినిమాలో నటించి ఆకట్టుకుంది. అయినా కూడా ఈ అమ్మడికి ఆ సినిమా లు గొప్ప ఆఫర్లను, పెద్ద సినిమాల్లో నటించే ఛాన్స్ లను తెచ్చి పెట్టలేదు. తెలుగు లో వచ్చిన చిన్న చిన్న ఆఫర్లతో కెరీర్ ను నెట్టుకు వస్తోంది.
బాలయ్య తో మూడు సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి బాలయ్య హీరోయిన్ అనే పేరు పడిపోయింది. మళ్లీ బాలయ్య మూవీ లో ఛాన్స్ వస్తుందేమో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సినిమాల్లో నటించినా.. నటించకున్నా కూడా ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తూనే ఉంటుంది.
ఎప్పుడూ కూడా క్లీ వేజ్ షో, నడుము నాభి అందాలను చూపిస్తూ, థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ కనిపించే సోనాల్ చౌహాన్ ఈసారి చాలా సర్ ప్రైజింగ్ గా నిండైన చీర కట్టు లో మెడలో రుద్రాక్ష మాలతో భక్తురాలిగా కనిపించింది. నుదుటిన పెద్ద పెట్టుతో చాలా పద్దతిగా కూర్చున్న సోనాల్ చౌహాన్ ను చూసి అవాక్కవుతున్న వారు చాలా మంది ఉన్నారు. బాలయ్య హీరోయిన్ సోనాల్ ను తాము ఎప్పుడు కూడా ఇలా చూస్తామనుకోలేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
Recent Random Post: