బిబి4 బెస్ట్‌ ఫ్రెండ్స్ నోభికస్య మళ్లీ కలిశారు

Share


తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్‌ లో బెస్ట్‌ ఫ్రెండ్స్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో నోయల్‌, అభిజిత్‌, హారిక, లాస్య పేర్లు ముందు వినిపిస్తాయి. వీరి స్నేహం గురించి సోషల్‌ మీడియాలో ఏ రేంజ్‌ లో చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక స్వచ్చమైన స్నేహం వీరి మద్య కొనసాగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బిగ్ బాస్ సీజన్‌ 4 ఫాలోవర్స్ వీరికి నోభికస్య అనే పేరు పెట్టి సోషల్‌ మీడియాలో వారి గురించి చర్చించుకునే వారు.

వారు మళ్లీ ఒకే చోట కలిస్తే బాగుండు అని అభిమానులు ఎదురు చూశారు. వారి కోరిక నెరవేరింది. ఇటీవల వారు కలిశారు. నలుగురు కలిసిన ఫొటోను నోయల్‌ షేర్‌ చేశాడు. ఈ సందర్బంగా ఆయన కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. కొంత మంది మద్య బంధాలు చెరిగి పోవు. వారి మద్య ఎడబాటు అనేది ఉండదు. ఏది ఏమైనా కూడా వారు మళ్లీ మళ్లీ కలిసేందుకు దారులు వెదుక్కుంటూ ఉంటారు. అయితే ఎప్పుడు కలిసేది మాత్రం కాలానికే వదిలేయాలి. అన్ని సమస్యలు ఏదో ఒక సమయంలో సమసి పోవడం ఖాయం అంటూ నోయల్‌ చెప్పుకొచ్చాడు.


Recent Random Post:

YS Jagan Hot Comments On CM Chandrababu

December 4, 2025

Share

YS Jagan Hot Comments On CM Chandrababu