
టాలీవుడ్‌లో ఏ ఈవెంట్ జరిగినా, అక్కడ నటుడు బ్రహ్మాజీ ఉంటే ఆ సందడే వేరు. తనదైన సెటైర్లు, కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించడంలో ఆయనకు సాటి ఎవరు ఉండరు. తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో కూడా బ్రహ్మాజీనే హైలైట్ అయ్యారు. సినిమా విశేషాల కంటే ఆయన చెప్పిన ట్రాఫిక్ ఇన్సిడెంట్, దానికి లింక్ చేస్తూ నిర్మాతపై పెట్టిన ఫన్నీ కండిషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా సినీ ఫంక్షన్లకు అతిథులు లేటుగా రావడం కామన్. కానీ ఈ ఈవెంట్‌కి టైమ్‌కు రావాలని బ్రహ్మాజీ చేసిన హడావిడే అసలు కామెడీ. స్టేజ్‌పైకి రావగానే సీరియస్‌గా స్టార్ట్ చేసి — “వస్తుంటే నన్ను మామూలుగా టెన్షన్ పెట్టలేదు” అని చెప్పి అసలు కథ బయటపెట్టేశారు.
ఈవెంట్ 4:30కి అని చెప్పి, నిర్మాతలు తనకు వరుసగా పది ఫోన్లు చేశారట. “రండి రండి అని బెదరగొట్టేశారు” అంటూ నవ్వించారు. ఆ టెన్షన్‌లో వెళ్తుంటే వేదికకు దగ్గర్లోని సిగ్నల్ వద్ద ఇరుక్కుపోయారట. ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి పది నిమిషాల పైగానే పడడంతో టైమ్ అవుతుందేమోనని టెన్షన్ పెరిగింది. చివరకు టైమ్‌కి చేరుకోవాలనే ఆవేశంలో… “సిగ్నల్ దగ్గర లైన్ జంప్ చేసి పారిపోయా… కానీ కెమెరా ఫోటో తీసేసింది” అంటూ ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసిన సంగతిని చాలా ఫన్నీగా షేర్ చేశారు.
చలాన్ ఖచ్చితంగా ఇంటికి వస్తుందనీ, అయితే ఆ తప్పు తనది కాదని — “త్వరగా రమ్మని ఫోన్లు చేసిన వాళ్లదే తప్పు!” అంటూ లాజిక్ పేల్చారు. ఇక్కడే బ్రహ్మాజీ తన అసలు పంచ్ వేశారు — ఆ చలాన్‌ను నిర్మాత సృజన్‌కి పంపిస్తానని, మీరే పే చేయాలి అంటూ స్టేజ్ మీదే డిమాండ్ పెట్టేశారు.
ఒకవేళ నిర్మాత కట్టకపోతే… “నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్లయినా పే చేయొచ్చు” అంటూ మరొక ఫన్నీ ఆఫర్ కూడా ఇచ్చేశారు. ఆయన మాటలతో ఆడిటోరియం మొత్తం నవ్వులతో మిగిలిపోయింది.
మొత్తానికి ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఈవెంట్‌లో బ్రహ్మాజీ స్పీచ్ ఓ రేంజ్‌లో పేలింది. తరుణ్ భాస్కర్–ఈషా రెబ్బా జోడీతో వస్తున్న ఈ సినిమా కూడా బ్రహ్మాజీ కామెడీలా ఫుల్ ఎంటర్టైనింగ్‌గా ఉంటుందని టీజర్ క్లారిటీ ఇచ్చింది. జనవరి 23న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ బ్రహ్మాజీ చలాన్ కామెడీతో భలే కిక్‌స్టార్ట్ అయ్యాయి.
Recent Random Post:















