భారతీయుడు 2 ఫ్లాప్ – ఇండియన్ 3పై లైకా భారీ ప్లాన్!

Share


కమల్ హాసన్ కెరీర్‌లోనే భారతీయుడు 2 అత్యంత నిరాశపరిచిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 25 ఏళ్ల క్రితం వచ్చిన లెజెండరీ క్లాసిక్ భారతీయుడుకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా, దర్శకుడు శంకర్ రాసుకున్న అతిసాధారణమైన కథతో ఫ్లాప్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా ఫలితంతో ఇండియన్ 3 వస్తుందా, రాదా అనే సందేహాలు అభిమానుల్లో బలంగా ఉన్నాయి.

శంకర్ గతంలో గేమ్ ఛేంజర్ విడుదలైన తర్వాత ఇండియన్ 3 పనులు మొదలుపెడతానని చెప్పినప్పటికీ, ఫ్యాన్స్ పెద్దగా నమ్మలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం, లైకా ప్రొడక్షన్స్ ఇప్పుడు ఇండియన్ 3 ను ముందుకు తీసుకురావడానికి గట్టిగా కసరత్తు చేస్తోంది.

సెకండ్ పార్ట్‌లో మాత్రమే ఉన్నా, సినిమాలో లేకపోయిన “పారా” పాటను వీడియో రూపంలో విడుదల చేశారు. ఇందులో ఇండియన్ 3 విజువల్స్ కూడా ఉండటంతో, ఇది కొంతవరకు సానుకూల అభిప్రాయాన్ని తెచ్చే అవకాశం ఉంది. అసలు కథంతా మూడో భాగంలోనే ఉందని ఇండస్ట్రీ టాక్.

కేవలం భ్రాండ్‌ను క్యాష్ చేసుకోవాలనే అత్యాశ వల్ల భారతీయుడు 2 అనవసరంగా సాగదీయడం, జనాలను విసిగించడం జరిగింది. అయినప్పటికీ, కమల్ హాసన్ సినిమా అయినందున, సరైన ప్రమోషన్లతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశముంది. అందులోను, సేనాపతి అసలు ఫ్లాష్‌బ్యాక్ మొత్తం ఇండియన్ 3లోనే ఉండబోతోందని టాక్. అయితే, లైకా ప్రొడక్షన్స్ ప్రస్తుత వ్యూహం ప్రకారం, మణిరత్నం “తగ్ లైఫ్” విడుదలైన తర్వాతే “ఇండియన్ 3” థియేటర్లలోకి రావాలని భావిస్తోంది.

ప్రస్తుతం తగ్ లైఫ్ పై భారీ క్రేజ్ నెలకొంది. ఇది హిట్ అయితే, ఆ తర్వాత వచ్చే కమల్ హాసన్ మూవీకి ఆటోమేటిక్‌గా బజ్ వస్తుందని లైకా వ్యూహం. అందుకే “పారా” పాటలో కొత్త సీన్ల క్లిప్పులను జోడించి రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర ముఖ్యమైనదిగా మారనుంది. అయితే, ఇండియన్ 3 నేరుగా ఓటీటీలో వస్తుందనే ప్రచారం వాస్తవం కాదని సమాచారం. థియేటర్ విడుదలకే లైకా ప్రాధాన్యత ఇస్తోందట. అయినా కమల్ హాసన్ లాంటి లెజెండరీ హీరోకి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఆశ్చర్యమే!


Recent Random Post: