మంచు ఫ్యామిలీ వివాదం, విష్ణు సెటైరికల్ సమాధానం వైరల్

Share


ఇటీవలి కాలంలో మంచు ఫ్యామిలీలో చోటుచేసుకుంటున్న వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా మంచు మనోజ్ మరియు మోహన్ బాబు మధ్య చెలరేగిన గొడవలు తీవ్రతరం అవుతున్నాయి. కోర్టు కేసులు, పరస్పర విమర్శలు ఈ కుటుంబ వివాదాన్ని మరింత హాట్ టాపిక్‌గా మార్చేశాయి. ఈ క్రమంలో మోహన్ బాబు కుటుంబం ఒకవైపు ఉండగా, మంచు మనోజ్ మాత్రం ఒంటరిగానే పోరాటం చేస్తుండడం గమనార్హం.

తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఇటీవల జరిగిన సంఘటన పెద్ద దుమారం రేపింది. అయితే ఈ గొడవలన్నిటిలో హైలైట్‌గా నిలిచిన విషయం, మంచు విష్ణు తన తమ్ముడు మంచు మనోజ్ ఇంటి జనరేటర్‌లో పంచదార వేసిన ఘటన. ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత చర్చనీయాంశమైంది.

తాజాగా మంచు విష్ణు ఈ అంశంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించాడు. “Ask Vishnu” పేరుతో నిర్వహించిన చాట్ సెషన్‌లో ఓ నెటిజన్, “మీరు నిజంగా మంచి మనసున్న వ్యక్తి, కానీ ఆ రోజు జనరేటర్‌లో పంచదార ఎందుకు వేసారు?” అని ప్రశ్నించగా, విష్ణు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. “ఫ్యూయెల్‌లో షుగర్ కలిపితే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్‌లో చదివా,” అని సెటైరికల్ రిప్లై ఇచ్చాడు. అయితే, ఈ వివాదంపై ఎక్కువ చర్చ జరగకుండా ఉండేందుకే విష్ణు హాస్యప్రాయంగా సమాధానం ఇచ్చి టాపిక్ నుంచి ఎస్కేప్ అయ్యాడని అభిమానులు అంటున్నారు.

ఇదిలా ఉండగా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ‘కన్నప్ప’ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 25న విడుదల కానుండగా, ఇది బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకంతో విష్ణు ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. కుటుంబ గొడవలు ఓవైపు కొనసాగుతుండగా, సినీ ప్రాజెక్టులపై మాత్రం మంచు విష్ణు పూర్తి ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.


Recent Random Post: