
సందీప్ కిషన్, రావు రమేష్, రీతూ వర్మ, అన్షు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మజాకా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది.
టీజర్ వరకు మంచి అంచనాలు క్రియేట్ చేసిన ‘మజాకా’ ట్రైలర్ రాకతో మిశ్రమ స్పందన వచ్చింది. ట్రైలర్ చూస్తే కథ పెద్దగా ఆకట్టుకునేలా లేదని, సినిమా మొత్తం క్రింజ్ కామెడీగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సినిమాలో మంచి ఎమోషన్ ఉందని, అదే సినిమాను నిలబెడుతుందనే నమ్మకంతో చిత్రబృందం ఉంది.
ఈ సినిమాలో రావు రమేష్ కొత్త అవతారం ఎత్తాడు. తొలిసారిగా ఫుల్ లెంగ్త్ లవర్ బాయ్ క్యారెక్టర్ పోషించాడు. తనకు ఓ హీరోయిన్ కూడా ఉంది. ఆమెను ఇంప్రెస్ చేయడానికి రావు రమేష్ పడే పాట్లు ట్రైలర్లో ఆసక్తిగా చూపించారు.
ఇక ప్రమోషన్స్‌లో రావు రమేష్ ఓ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాడు. సినిమాలో రెండు ఎమోషనల్ సీన్స్ ఉంటాయని, అందులో ఒకటి తనకు-అన్షుకు మధ్య, మరొకటి రీతూ వర్మతోనటించినదని వెల్లడించాడు. రీతూ వర్మతో తన సీన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయితే అది ఒక ఐకానిక్ మునుముందు అవుతుందని అతడు విశ్వాసంగా అన్నాడు.
ఈ సినిమాకు తన వంతుగా 42 రోజులు పని చేశానని, సినిమా చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారని రావు రమేష్ చెప్పాడు. సినిమా ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి!
Recent Random Post:















