మెగాస్టార్ చిరంజీవి 158, హీరోయిన్‌గా రాణీ ముఖర్జీ?

Share


మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అధికారికంగా లాక్ అయిన విషయం తెలిసిందే. ‘దసరా’ సినిమాతో తన మాస్ డైరెక్షన్ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న శ్రీకాంత్, చిరంజీవికి భారీ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌ను సిద్ధం చేస్తున్నాడు. 30 ఏళ్ల క్రితం మెగాస్టార్ పవర్, రౌద్రాన్ని మళ్లీ వెండితెరపై చూపించబోతున్నట్లు టాక్. చిరు నుంచి ఇలాంటి ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చాలా కాలంగా రాలేదని, అందుకే ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి.

ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. నటీనటుల ఎంపిక, టెక్నికల్ టీమ్, పాన్-ఇండియా అద్భుతమైన ప్రెజెంటేషన్ కోసం ప్లానింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా హీరోయిన్ కాస్టింగ్ గురించి ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది.

రాణీ ముఖర్జీ హీరోయిన్‌గా ఫిక్స్ అవుతుందా?

మెగాస్టార్ చిరంజీవికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ అయితే బాగుంటుందని చిత్రబృందం భావించినట్లు సమాచారం. చిరంజీవి ప్రస్తుతం 70 ఏళ్ల వయస్సులో ఉన్నా, ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌కు సరిపోయే హీరోయిన్ రాణీనే అని అంటున్నారు. రాణీ ముఖర్జీ ప్రస్తుతం 46 ఏళ్ల వయస్సులో ఉండటంతో ఈ జోడీ తెరపై గ్రాండ్‌గా కనిపిస్తుందని భావిస్తున్నారు.

ఈ పేరును దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రపోజ్ చేయగానే చిరు కూడా ఆసక్తిగా స్పందించినట్లు టాక్. కానీ, రాణీ ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరిస్తుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. గత రెండు సంవత్సరాలుగా ఆమె హిందీ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. తెలుగులోనూ ఇప్పటివరకు ఏ సినిమా చేయలేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి వచ్చిన ఈ భారీ ఆఫర్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి.

మొత్తం మీద చిరంజీవి 158 సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. త్వరలోనే మేకర్స్ అధికారిక అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.


Recent Random Post: