యష్ గ్లోబల్ ఫిల్మ్ కి రెడీ!

Share


హాలీవుడ్ ఫ్రాంఛైజీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ వసూళ్లు సాధించడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. వార్నర్ బ్రదర్స్, డీసీ, యూనివర్సల్ పిక్చర్స్ వంటి నిర్మాణ సంస్థలు తరచుగా భారీ చిత్రాలను రూపొందిస్తున్నాయి. ఇటీవల, భారతదేశం మరియు చైనాలో హాలీవుడ్ సినిమాలు వందల కోట్ల వసూళ్లను రాబడుతున్నాయి. ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని, భారతీయ సినీ పరిశ్రమ కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోంది.

ఈ మార్పును టాలీవుడ్, బాలీవుడ్, కన్నడ పరిశ్రమల్లో స్పష్టంగా గమనించవచ్చు. తాజాగా, “కేజీఎఫ్” ఫేమ్ యష్ నటిస్తున్న “టాక్సిక్” చిత్రాన్ని గ్లోబల్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆమె ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. “టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్” పేరుతో వస్తున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోంది.

ఇటీవల విడుదలైన టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందించి, భారతదేశంలోని ఇతర భాషల్లో డబ్బింగ్ చేయనున్నారు. అంతేగాక, ప్రపంచవ్యాప్తంగా విడుదలను లక్స్యంగా చేసుకుని అదనంగా మరో 40-50% బడ్జెట్ పెంచే అవకాశం ఉందని సమాచారం.

ఈ స్థాయిలో బడ్జెట్ వెచ్చించడానికి ప్రధాన కారణం దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మీద ఉన్న నమ్మకం. ఆమె గతంలో “లైయర్స్ డైస్” వంటి జాతీయ అవార్డు గ్రహీత చిత్రాన్ని రూపొందించారు. అంతేకాదు, 2016లో సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ దర్శకురాలిగా గుర్తింపు పొందారు. “ఇన్షా అల్లా” అనే చిత్రంతో ఈ గౌరవాన్ని అందుకున్నారు.

ఇది మాత్రమే కాదు, “టాక్సిక్” చిత్రానికి “ఐరన్ మ్యాన్”, “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్”, “జాన్ విక్” వంటి ప్రఖ్యాత ఫ్రాంచైజీలలో పనిచేసిన ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ అంతర్జాతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. యష్ ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి నమ్మకంతో భారీ బడ్జెట్‌కి అంగీకరించడం, భారతీయ సినిమాలు హాలీవుడ్ స్థాయికి ఎదుగుతున్నట్లు సూచిస్తోంది.

“టాక్సిక్” సినిమా ద్వారా యష్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్‌ను పెంచుకునే అవకాశం ఉంది. ఈ సినిమా విడుదలకు ముందు మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లు అందే అవకాశం ఉంది.


Recent Random Post: