రాజకీయ డ్రామాతో రానున్న దేవా కట్ట ‘మయసభ’ ట్రైలర్ ఆకట్టుకుంది

Share


టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు దేవా కట్ట తెరకెక్కించిన తాజా సినిమా ‘మయసభ’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఈ కథలో, స్నేహితులుగా ఉన్న ఇద్దరు నాయకులు ఎలా రాజకీయ ప్రత్యర్థులుగా మారారు అనేది ప్రధాన కథాంశం.

ఆది పినిశెట్టి మరియు చైతన్య రావు లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో మంచి అంచనాలు ఏర్పడగా, ఇప్పుడు ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్‌లో ఇద్దరు స్నేహితుల మధ్య రాజకీయ పోరాటం ఎలా ప్రారంభమై విపరీత స్థాయికి చేరిందో దర్శకుడు మరింత వివరంగా చూపించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.

ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవా కట్టతో తన ‘రిపబ్లిక్’ షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. అలాగే సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, దర్శకుడి వర్కింగ్ స్టైల్ గురించి సరదాగా చెప్పాడు.

మయసభ ట్రైలర్‌ చూస్తుంటే థియేట్రికల్ కంటెంట్‌తో కూడిన సినిమా అనిపిస్తోంది. రియల్ లీడర్స్‌ను పోలినట్లుగా ఆది పినిశెట్టి, చైతన్య రావులకు పవర్‌ఫుల్ రోల్స్ దక్కాయి. రాజకీయాలపై కొత్త కోణంలో చూపించే కథలు చెప్పడంలో దేవా కట్ట ప్రత్యేకత ఉండటంతో, ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ‘ప్రస్థానం’ వంటి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన ఆయన నుంచి గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా సమాజాన్ని కదిలించే కంటెంట్‌తో ప్రత్యేకంగా నిలిచేలా ఉందని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది.


Recent Random Post: