
దర్శకధీర రాజమౌళి ఎన్నో సందర్భాల్లో తన కలల ప్రాజెక్టుగా పేర్కొన్నది మహాభారతం. టాలీవుడ్ టాప్ హీరోలతో భారీ బడ్జెట్, విస్తృత స్కేల్‌లో ఈ ప్రాజెక్టును మూడు లేదా నాలుగు భాగాలుగా తెరకెక్కించాలనే ఆకాంక్షను అభిమానులు ఉంచుకున్నారు. అయితే, ఇప్పటివరకు రాజమౌళికి ఆ ప్రాజెక్ట్ సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు ఆ భవిష్యత్ స్వప్నాన్ని ఆమీర్ ఖాన్ నెరవేర్చేలా కనిపిస్తున్నాడు.
తన 60వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ విషయం గురించి ఆమీర్ స్వయంగా వెల్లడించాడు. మహాభారతం స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే ప్రారంభమైందని, ప్రాజెక్ట్ మొదటి ఏడాది పురోగతిని బట్టి మొత్తం ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాడు.
క్యాస్టింగ్ వివరాలను వెల్లడించలేదు కానీ, ఈ ప్రాజెక్ట్ కోసం భారీ స్థాయిలో ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్ – సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రామాయణం తెరకెక్కుతోంది. అయితే, అది కేవలం మరో సినిమాగా కాకుండా, అత్యున్నత స్థాయిలో తెరకెక్కిస్తోన్న ప్రాజెక్ట్ అని ఇప్పటికే హింట్ ఇచ్చాడు.
గతంలో అల్లు అరవింద్ మరియు మధు మంతెన లాంటి ప్రముఖ నిర్మాతలు కూడా మహాభారతం సినిమాను వందల కోట్ల బడ్జెట్‌తో తీయాలని భావించారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. తెలుగులో దానవీరశూర కర్ణ తర్వాత మహాభారత ఇతిహాసానికి తగ్గ మరో గొప్ప సినిమా రాలేదు. ఇప్పుడు ఆ ఖాళీని ఆమీర్ ఖాన్ భర్తీ చేయగలడా అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే, ఆమీర్ ప్రస్తుతం తారే జమీన్ పర్ సీక్వెల్ అయిన సితారే జమీన్ పర్ ను వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే, గతంలో అతని లాల్ సింగ్ చద్దా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇటీవల తన కొడుకుతో తెరంగేట్రం చేయించినా, మహారాజ్ మరియు లవ్ యాపా థియేటర్, ఓటీటీలో నిరాశజనక ఫలితాలను అందుకున్నాయి.
ఈ పరాజయాలను దాటి మళ్లీ బలంగా నిలవాలనే లక్ష్యంతో, ఇప్పుడు ఆమీర్ ఖాన్ మహాభారతం లాంటి పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌ను తన భుజస్కంధాలపై తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాల్సిందే!
Recent Random Post:















