రాబిన్‌హుడ్ వివాదం: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు!

Share


నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్‌హుడ్ చిత్రం మార్చి 27న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించగా, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక క్యామియో చేశారు. రీసెంట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వార్నర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, అక్కడ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. వార్నర్‌ను ఉద్దేశించి అనుకోకుండా నోరు జారిందని, తన మాటల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిందని భావిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. “మేమంతా ఈవెంట్‌కు ముందు సరదాగా ముచ్చటించాం. స్టేజ్‌పై మాట్లాడే సమయంలో అపార్థం కలిగేలా మాట్లాడేశాను. నా ఉద్దేశ్యం పూర్తిగా సరదాగా ఉండేది. వార్నర్‌ను నేను గౌరవిస్తాను, అతని క్రికెట్‌ను ప్రేమిస్తాను. మేమిద్దరం బాగా స్నేహితులం” అని రాజేంద్ర ప్రసాద్ వివరించారు.

ఈ వివాదం చిత్రబృందంపై ప్రతికూల ప్రభావం చూపించినప్పటికీ, రాబిన్‌హుడ్ ప్ర‌మోష‌న్స్ మాత్రం ఊపందుకున్నాయి. నితిన్, వెంకీ కుడుముల, శ్రీలీల ఈ సినిమా విజయంపై గట్టి నమ్మకం ఉంచారు. ప్రాముఖ్యత లేని క్యామియోలా అనుకున్న వార్నర్‌ను, రాబిన్‌హుడ్ టీమ్ ప్ర‌మోష‌న్స్‌లో ప్రధానంగా వినియోగిస్తోంది. ఇక మరికొద్ది గంటల్లోనే సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి!


Recent Random Post: