రామ్ చరణ్ సినిమాలో తల్లి పాత్రని తిరస్కరించిన శ్వాసిక

Share


సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకసారి ఎలాంటి పాత్ర చేసినా, ఆ తర్వాత కూడా ఎక్కువగా అలాంటి రోల్స్‌నే ఆఫర్ చేస్తుంటారు. ముఖ్యంగా కొన్ని పరిస్థితుల్లో చేసిన పాత్రలు తర్వాత ఇబ్బంది పెడతాయి. అలాంటి దశను ఎదుర్కొంటున్న నటి ఇప్పుడు ఒక బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులారా వదులుకుంది.

అదే 33 ఏళ్ల మలయాళ నటి శ్వాసిక. ఇటీవల లబ్బర్ పందు సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించి మెప్పించింది. ఆ పాత్రతో మంచి పేరు తెచ్చుకున్నా, ఇప్పుడు ఎక్కువగా ఆమెకు మదర్ రోల్స్ మాత్రమే వస్తున్నాయని చెబుతోంది. దీంతో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో తల్లిగా నటించే ఛాన్స్‌నే తిరస్కరించిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

శ్వాసిక మాట్లాడుతూ – “ఒకసారి తల్లి పాత్ర చేయడం వల్ల ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ తల్లిగా నటించే అవకాశం వచ్చింది. కానీ ఇలాంటి రోల్స్ చేస్తే నా కెరీర్ ఎటు వెళ్లిపోతుందో తెలియదు. ప్రస్తుతం అలాంటి పాత్రలు చేయాలని అనుకోవడం లేదు. భవిష్యత్తులో అవసరం అయితే ఆలోచిస్తాను” అని చెప్పింది.

దీంతో అభిమానులు – “ఇలాంటి బంగారం లాంటి ఛాన్స్ వదులుకోవడం తప్పు కాదా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులకు శ్వాసిక కొత్త కాదు. ఇటీవల నితిన్ నటించిన తమ్ముడు సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసి ఆకట్టుకుంది. హీరోయిన్‌గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఆమెకు మదర్ రోల్స్ వరుసగా రావడంతో వాటిని పక్కన పెడుతోందని తెలుస్తోంది.

ఇక రామ్ చరణ్ పెద్ది సినిమా విషయానికి వస్తే – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రీడా నేపథ్య చిత్రం భారీ అంచనాలు తెచ్చుకుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.


Recent Random Post: