
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది తర్వాత చేస్తున్న సినిమా సుకుమార్ దర్శకత్వంలో రాబోతుందన్న వార్త ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. రంగస్థలం తర్వాత ఈ కాంబినేషన్ వస్తోందంటే మరో సెన్సేషనల్ సినిమా పుట్టబోతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం కథ ఫైనల్ కాగా, ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే అంశంపై తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. టాక్ ప్రకారం ఈ క్రేజీ ఛాన్స్‌ను కన్నడ భామ రుక్మిణి వసంత్ దక్కించుకుందని వినిపిస్తోంది. సప్త సాగరాలు దాటి సినిమాతో యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న రుక్మిణి, ఆ తర్వాత మదరాసితో కూడా మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా చేస్తోంది.
తెలుగులో కూడా రుక్మిణి ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతోంది. మదరాసి ప్రమోషన్లలోనే రుక్మిణి, “చరణ్ అంటే నాకు చాలా ఇష్టం” అని చెప్పడం మెగా ఫ్యాన్స్‌ను మరింత ఎగ్జైటెడ్ చేసింది. అందుకే సుకుమార్ సినిమాలో చరణ్ సరసన రుక్మిణిని ఫిక్స్ చేయమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
సౌత్‌లో, ముఖ్యంగా తెలుగు–తమిళ పరిశ్రమల్లో రుక్మిణి క్రేజ్ పెరుగుతోంది. సప్త సాగరాలు దాటి రెండు భాగాల్లో ఆమె నటన ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఆ సినిమాలో చేసిన “ప్రియ” పాత్రతో ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఈ పాపులారిటీతో టాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్‌గానూ ఎదగడానికి మంచి అవకాశాలున్నాయి.
అందుకే రష్మిక తర్వాత టాలీవుడ్లో రుక్మిణి వసంత్ కూడా స్టార్ రేంజ్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రాబోయే లైనప్ సినిమాలు ఆమెను ఎక్కడ నిలబెడతాయో చూడాలి.
Recent Random Post:















