రామ్‌తో కిషోర్ డైరెక్షన్‌లో కొత్త సినిమా

Share


టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం NC24 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘తండేల్’ మూవీలో హిట్ అందుకున్న ఆయన రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టారు. స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన నాగచైతన్య, ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక పౌరాణిక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇదే సమయంలో నాగచైతన్య 25వ సినిమాగా కిషోర్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తారనే టాక్, రానా దగ్గుబాటి సమర్పకుడిగా ఉంటారని ప్రచారం జోరుగా సాగింది. అయితే, తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం నాగచైతన్య ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల సినిమా చేయలేనని నిర్మాతలకు ఆయన తెలిపారు.

ఇక ఈ సినిమాలో కథను ఎనర్జిటిక్ స్టార్ రామ్‌కి వినిపించగా, రామ్‌కు కథ బాగా నచ్చిందని అంటున్నారు. దాంతో రామ్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఫైనల్ చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తారని వినికిడి.

ప్రస్తుతం రామ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో ఆంధ్రా కింగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఫ్యాన్ బయోపిక్‌గా రానుంది. రీసెంట్‌గా విడుదలైన గ్లింప్స్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పూర్తయిన తర్వాత కిషోర్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి రామ్ ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ఎప్పటినుంచి ప్రారంభిస్తాడో వేచి చూడాలి.


Recent Random Post: