రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడులు – కాజోల్ వ్యాపార దూకుడు!

Share


సెలబ్రిటీల ఆదాయాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫాంలో ఉన్నంతకాలం భారీగా సంపాదించి, ఆ సంపదను వ్యాపారాల్లో పెట్టుబడులుగా మార్చుకుంటారు. ముఖ్యంగా, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం చాలా మంది సినీ తారలకు ఆర్థికంగా లాభదాయకమైన వ్యాపారంగా మారింది. తాజాగా, బాలీవుడ్ నటి కాజోల్ ముంబైలో ప్రేమియం రిటైల్ ప్రాపర్టీని కొనుగోలు చేసి మరోసారి తన వ్యాపార ప్రణాళికను రుజువు చేసింది.

28 కోట్లతో భారీ పెట్టుబడి
కాజోల్ ఇటీవలే ముంబై గోరేగావ్‌లో రూ. 28.78 కోట్ల విలువైన కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేసింది. ఇది భారత్ రియాల్టీ వెంచర్స్ సంస్థకు చెందిన 4,365 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్రదేశం. ప్రత్యేకంగా ఐదు కార్ల పార్కింగ్ స్పేస్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

ఇది మొదటిసారి కాదు. 2023లో కాజోల్ ముంబైలో రూ. 7.64 కోట్లతో ఓ ఆఫీసు స్థలాన్ని కూడా కొనుగోలు చేసింది. ఇది 194.67 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెరా కార్పెట్ ఏరియాలో ఉంది. అంతేకాదు, అంధేరీ వెస్ట్‌లోని వీర్ దేశాయ్ రోడ్డు వద్ద ఉన్న సిగ్నేచర్ బిల్డింగ్‌ను కూడా తన ఆస్తుల జాబితాలో చేర్చుకుంది.

అదే ఏడాది, భారత్ రియల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ. 16.50 కోట్లకు మరో అపార్ట్‌మెంట్ కూడా కొనుగోలు చేసింది.

రియల్ ఎస్టేట్ – బాలీవుడ్ తారల కొత్త పెట్టుబడి హబ్
ఇటీవల బాలీవుడ్ తారలు కమర్షియల్ ప్రాపర్టీల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం ఓ ట్రెండ్‌గా మారింది. రెసిడెన్షియల్ ప్రాపర్టీలతో పోలిస్తే, కమర్షియల్ రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే వార్షిక అద్దె ఆదాయం ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

ఇప్పటికే బాంద్రా, ఖార్, అంధేరీ, లోఖండ్‌వాలా, వర్లీ వంటి ముంబై ప్రధాన ప్రాంతాల్లో అనేక విల్లాలు, బిల్డింగ్‌లు బాలీవుడ్ ప్రముఖుల అధీనంలో ఉన్నాయి. కాజోల్ కూడా ఇదే బాటలో నడుస్తూ, తన సంపాదనను రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా మార్చుకుంటూ భారీ లాభాలు సాధిస్తోంది.


Recent Random Post: