రుక్మిణి వసంత్ నేషనల్ క్రష్ అవుతుందా?

Share


కన్నడ భామ రుక్మిణి వసంత్ కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్ లో ఉందని చెప్పొచ్చు. సౌత్‌లోనే కాదు, నేషనల్ లెవెల్‌లో కూడా ఆమె పేరు హాట్ టాపిక్‌గా మారింది. సప్తసాగరాలు దాటి సినిమాలో ప్రియ పాత్రతో ప్రేక్షకుల మనసులను దోచేసిన రుక్మిణి, ఆ సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ని ఏర్పరుచుకుంది. ఆమె ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌కి తోడు గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి పెద్ద క్రేజ్ వచ్చింది.

ఇక తాజాగా విడుదలైన కాంతారా చాప్టర్ 1లో కనకావతి పాత్రలో రుక్మిణి మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేసింది. రిషబ్ శెట్టి యాక్టింగ్, టేకింగ్ ఎంత ఇంప్రెస్ చేసాయో, రుక్మిణి నటన కూడా అంతే ఇంపాక్ట్ చూపించింది. సినిమాలో ఆమె లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ గురించి సోషల్ మీడియాలో భారీ చర్చలు జరుగుతున్నాయి. కాంతారా థియేట్రికల్ రన్ సమయంలోనే రుక్మిణి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో సినిమా స్ట్రీమ్ అవడంతో మరోసారి ఆమె పేరు హాట్ ట్రెండ్‌గా మారింది.

ఫ్యాన్స్ మాత్రం “కాంతారా లో రుక్మిణి తప్ప ఇంకెవరినీ ఊహించలేము” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ రేంజ్‌లో ఆమె ఇంప్రెషన్ చూపించిందని చెప్పాలి. కాంతారా ఇచ్చిన క్రేజ్ రుక్మిణి కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఇక ఇప్పుడు ఆమె టాలీవుడ్‌లో కూడా బిజీ అవుతోంది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో రుక్మిణి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో నిఖిల్‌తో చేసిన సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా, కాంతారా ఇచ్చిన ఇమేజ్‌తో రుక్మిణి చేసే ప్రతి సినిమా మీద ఇప్పుడు మంచి హైప్ ఉంది.

ఇక కొందరు నెటిజన్లు అయితే “నేషనల్ క్రష్ ట్యాగ్ రష్మిక నుండి రుక్మిణికి ఇవ్వాలి” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా రుక్మిణి వసంత్ ఇప్పుడు సౌత్‌లోనే కాదు, పాన్-ఇండియా లెవెల్‌లో కూడా ఫాలోయింగ్ పెంచుకుంటున్న టాలెంటెడ్ హీరోయిన్‌గా రాణిస్తోంది.


Recent Random Post: