
వారసుడు తర్వాత వంశీ పైడిపల్లి నుంచి ఇప్పటివరకు ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కాలేదు. ఇది విడుదలై రెండేళ్లైనా, మరో సినిమా పట్టాలెక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మహర్షి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఖాళీగా ఉండాల్సి రావడం దర్శకుడి దౌర్భాగ్యం. ప్రస్తుతం స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండటంతో, హిట్ డైరెక్టర్లే కథలతో వెయిట్ చేస్తున్న పరిస్థితి.
ఈలోగా వంశీ పైడిపల్లి బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్‌ను కలసినట్టు సమాచారం. ఆమీర్‌కి ఓ కథ వినిపించగా, ఆ కథపై ఆసక్తి చూపుతూ డెవలప్మెంట్ కొనసాగించమని సూచించాడట. అయితే తాజా సమాచారం ప్రకారం వంశీ తన ప్లాన్‌లో యూ టర్న్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఆమీర్ షెడ్యూల్ బిజీగా ఉండటంతో, ఆయన కోసం కథను సిద్ధం చేసి వెళ్లినా వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం లేదని వంశీ గ్రహించాడట. అందుకే మళ్లీ తెలుగులోనే ప్రాజెక్ట్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే యువసామ్రాట్ నాగచైతన్యను వంశీ సంప్రదించాడు. ఇటీవల చైకి ఓ కథ వినిపించగా, చైతన్యకు కథ నచ్చిందట. అయితే డేట్లు కేటాయించడం మాత్రం వెంటనే సాధ్యం కాదు. ప్రస్తుతం చైతన్య కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అనంతరం శివ నిర్వాణతో తన 26వ సినిమాను చేయాల్సి ఉంది. ఈ రెండు పూర్తి కాగానే వంశీ సినిమా చేసే అవకాశం ఉండొచ్చని ఇండస్ట్రీ టాక్.
అంతేకాదు, చైతన్య ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. పోనీటెయిల్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి డిఫరెంట్ గెటప్‌లో నటిస్తున్న చై, వంశీతో కలిసి పనిచేస్తే మరో కొత్తగా ఉండొచ్చు.
ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, వంశీ పైడిపల్లి – నాగచైతన్య కాంబో నిజంగానే సెట్లోకి వెళ్తుందా? లేక మరో మార్పు జరగబోతుందా? అన్నది.
Recent Random Post:














