వర్మ వ్యాఖ్యలు.. మరోసారి వివాదాల్లో!

Share


వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ఇటీవల ఆయన అనురాగ్ కశ్యప్‌తో కలిసి ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను ప్రస్తావించాడు.

ఈ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ, unnecessary బడ్జెట్ ఖర్చులు గురించి తనదైన శైలిలో స్పందించాడు. ‘‘బాహుబలి తర్వాత ఇండియన్ సినిమాల స్థాయి పెరిగింది, కానీ ఆ స్థాయికి చేరడానికి అవసరమైన బడ్జెట్‌ అవసరమా అనేది ఒక ప్రశ్న,’’ అని పేర్కొన్నాడు. తన ‘సత్య’ సినిమా ప్రస్తావిస్తూ, ‘‘ఆ సినిమాకు మరో ఐదు కోట్లు ఎక్కువ పెట్టుంటే అది పూర్తిగా డిజాస్టర్ అవుతుండేది,’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు.

అదే ఇంటర్వ్యూలో, 1970లు-80లలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన సినిమాలు సౌత్‌లో రీమేక్ కావడం వల్లే అక్కడి హీరోలు స్టార్‌డమ్ సాధించారని వర్మ అభిప్రాయపడ్డాడు. ‘‘బచ్చన్ మాస్ సినిమాలు రీమేక్ చేయడం వల్లే రజనీకాంత్‌, చిరంజీవి, ఎన్టీఆర్‌, రాజ్ కుమార్ వంటి హీరోలకు పెద్ద గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచే అభిమానులు హీరోలను దేవుళ్లుగా కొలిచే పద్ధతి మొదలైంది,’’ అని వర్మ అన్నారు.

బాలీవుడ్‌లో మ్యూజికల్ ఫిల్మ్స్‌కు ప్రాధాన్యం పెరిగి మాస్ సినిమాలకు వెనుకంజ పడగా, సౌత్‌లో మాత్రం అదే మాస్ ఫార్ములాతో సినిమాలు కొనసాగడం వల్ల స్థాయి పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ‘‘ఇప్పటికీ మాస్ సినిమాలకు మూలాలు అమితాబ్ సినిమాలే’’ అన్న వ్యాఖ్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వర్మ ఈ వ్యాఖ్యలతో సౌత్ ఫిల్మ్ మేకర్స్ క్రియేటివిటీని తక్కువ చేస్తూ మాట్లాడుతున్నాడని పలువురు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ‘‘అమితాబ్‌పై అభిమానంతో మాట్లాడొచ్చు కానీ, అది ఇతరులను తక్కువచేసేలా ఉండకూడదు,’’ అని నెటిజన్లు అంటున్నారు.

ఈ వ్యాఖ్యలు వర్మపై మరోసారి వివాదాల పుట్టను తెరిచాయి. వర్మ అన్నింటిపై తనదైన స్టైల్‌లో స్పందిస్తూ ఉండడం కొత్తేమీ కాదు గానీ, ఈసారి చేసిన వ్యాఖ్యలు మాత్రం సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


Recent Random Post: