విజయ్ ఆంటోని మార్గన్ తో మళ్లీ అలరించగలడా?

Share


బిచ్చగాడు, బేతాళుడు, బిచ్చగాడు 2 వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ ఆంటోని, తాజాగా మరో చిత్రం మార్గన్తో రాబోతున్నాడు. ఈ నెల 27న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన విజయ్ ఆంటోని, తనకు రాజకీయాలపై ఎటువంటి అవగాహన లేదని, రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశ్యం అసలే లేదని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు పలు స్టార్‌లు సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టినా, అక్కడ సక్సెస్ అయిన వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఈ విషయంపై స్పందించిన విజయ్ ఆంటోని, ఫేమ్ ఉందని కేవలం రాజకీయాల్లోకి రావడం కుదరదని, తనకు ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశం ఉంటే అది పూర్తిగా ప్రజల మద్దతుతోనే ఉండాలని అన్నారు. అలాగే, రాజకీయాల్లోకి రావాలంటే ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం చాలా అవసరమని, తాను అలా చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదని క్లారిటీ ఇచ్చారు.

అదే సమయంలో, సినీ పరిశ్రమలో డ్రగ్స్ సమస్యపై కూడా విజయ్ ఆంటోని స్పందించారు. సినీ రంగంలో ఈ సమస్య ఉందని, చాలామంది దానికి బానిస అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మార్గన్ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించగా, విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో మంచు విష్ణు నటించిన కన్నప్ప కూడా విడుదల అవుతుండటంతో, ఈ పోటీ మధ్య విజయ్ ఆంటోని చిత్రం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

ఇప్పటివరకు బిచ్చగాడు, బిచ్చగాడు 2 సినిమాలు సక్సెస్ సాధించినప్పటికీ, తరువాతి సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి. మరి, మార్గన్తో విజయ్ ఆంటోని కోరుకున్న హిట్‌ను అందుకుంటాడో లేదో చూడాలి.


Recent Random Post: