
వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరంజీవి చేసిన “భోళా శంకర్” బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.
మహర్ రమేష్ డైరెక్షన్లో వచ్చిన ఈ రీమేక్ చిరుకు నిరాశను మిగిల్చింది. ఇక ఆచార్య డిజాస్టర్ తర్వాత చిరు కెరీర్‌కి మళ్లీ ఊపు తెచ్చే ఉద్దేశంతో “విశ్వంభర” అంటూ భారీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి బింబిసారతో పేరు తెచ్చుకున్న మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, అషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరికి సీక్వెల్‌గా వస్తోందన్న ఊహాగానాలు ఇండస్ట్రీలో హీట్ క్రియేట్ చేశాయి. కానీ, మేకర్స్ మాత్రం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
అయితే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మాత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. గ్రాఫిక్స్ మరీ నార్మల్‌గా, outdatedగా ఉండటంతో ఇదేనా చిరు సినిమా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో వీఎఫ్ఎక్స్ టీమ్ మళ్లీ పని మొదలు పెట్టి, అవే తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నెగటివ్ బజ్ ప్రభావం ఓటీటీ డీల్ మీద కూడా పడినట్లు టాక్.
ఇప్పుడు ఈ సినిమా పట్ల నెగటివిటీని పోగొట్టాలంటే, ప్రమోషనల్ కంటెంట్ ఏకంగా భారీ ఇంపాక్ట్ కలిగించాలి అని ఇండస్ట్రీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఫైనల్‌గా చెప్పాలంటే… విశ్వంభర మరొక భోళా శంకర్ కాకుండా చిరు కెరీర్‌కి మళ్లీ రెట్టింపు ఊపునివ్వాలంటే, మేకర్స్ ఈసారి ప్రమోషన్, గ్రాఫిక్స్ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిందే!
Recent Random Post:















