‘విశ్వంభర’ షూటింగ్ పూర్తయింది – సెప్టెంబర్‌లో రిలీజ్ ప్లాన్

Share


ఎట్టకేల‌కు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ పూర్తయింది. చిరంజీవి – మౌనీ రాయ్‌లపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌తో టాకీ మరియు అన్ని షూటింగ్ పనులు శుక్రవారం ముగిశాయి. గతంలో టాకీ భాగం పూర్తయినా, ఈ ఐటమ్ సాంగ్ కోసం హీరోయిన్ ఎంపికలో ఆలస్యం జరగడంతో షూటింగ్ కొంతకాలంగా పెండింగ్‌లో పడింది. పలువురిని పరిశీలించిన తర్వాత చివరికి బాలీవుడ్ నటి మౌనీ రాయ్‌కి అవకాశం దక్కింది. దీంతో పాట చిత్రీకరణ కూడా పూర్తయింది.

ఈ చిత్రం సోషల్ ఫాంటసీ థ్రిల్లర్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాయి. వీటి కారణంగా రిలీజ్ తేదీపై మేకర్స్‌కు స్పష్టత లేకపోయింది. అయితే ఇప్పుడు అన్ని పనులు సక్రమంగా పూర్తవుతున్న నేపథ్యంలో, సెప్టెంబర్ 18న రిలీజ్ చేయాలని భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ త్వరలోనే రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసి ప్రకటించే అవకాశం ఉంది. పాట పూర్తయిన తర్వాత చిరంజీవి మళ్లీ ‘మెగా157’ షూటింగ్‌లో బిజీ అవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ఐటమ్ సాంగ్ కోసం తీసుకున్న గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ అదే ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో షూటింగ్ పూర్తిచేసి, జనవరిలో గ్రాండ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Recent Random Post: