వైష్ణవ్ తేజ్ – విక్రమ్ కుమార్ న్యూ కాంబోపై టాలీవుడ్ ఫోకస్

Share


తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం ఏ స్టార్‌ హీరోకైనా పెద్ద సవాలే. కానీ ‘ఉప్పెన’ ద్వారా వైష్ణవ్ తేజ్ ఆ అరుదైన ఫీట్ సాధించాడు. సినిమా సక్సెస్‌లో హీరోకు పూర్తిస్థాయి క్రెడిట్ ఇవ్వలేనప్పటికీ, డెబ్యూ మూవీయే 100 కోట్ల మార్క్ చేరుకోవడం వైష్ణవ్‌కు భారీ ప్లస్‌గా నిలిచింది.

అయితే, ఆ హైప్‌ను హీరో తన కెరీర్‌ను ముందుకు నడిపించడానికి ఉపయోగించుకోలేకపోయాడు. రెండో చిత్రం ‘కొండపొలం’ ఘోర పరాజయం పొందగా, ‘రంగ రంగ వైభవంగా’ మరియు ‘ఆదికేశవ’ వరుసగా డిజాస్టర్లై, తొలి సినిమా ఇచ్చిన మార్కెట్ మొత్తాన్ని చెరిగిపోయేలా చేశాయి. ఫలితంగా వైష్ణవ్ మళ్లీ ఎలాంటి సినిమాతో ముందుకు రావాలన్న విషయంలో కన్ఫ్యూజన్‌లో పడ్డాడు.

‘ఆదికేశవ’ విడుదలై దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నాయి. ఈ వ్యవధిలో కొత్త సినిమాను ప్రకటించకపోవడం పరిశ్రమలోనే కాక అభిమానుల్లో కూడా సందేహాలు రేకెత్తిస్తోంది. ఇటువంటి గ్యాప్ హీరో మార్కెట్‌ను దెబ్బతీయడమే కాక, రీఎంట్రీ పట్ల కూడా చాలానే సవాళ్లు తీసుకువస్తుంది.

ఇప్పుడేమో తాజా సమాచారం ప్రకారం వైష్ణవ్, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ నుంచి కథా వినిపించుకున్నట్లు తెలుస్తోంది. ‘హలో’, ‘గ్యాంగ్ లీడర్’, ‘థాంక్యూ’ వంటి సినిమాల ఫ్లాపుల తర్వాత విక్రమ్ కూడా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘ధూత’ వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకున్నప్పటికీ, కొత్త సినిమా ఫైనలైజ్ చేసే ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలితం ఇవ్వలేదు.

నితిన్, విజయ్ దేవరకొండ వంటి హీరోలతో కూడా ప్రాజెక్టులు సెట్ కాలేకపోయిన విక్రమ్—ఇప్పుడు వైష్ణవ్‌తో ఈ కాంబినేషన్‌ను సీరియస్‌గా పరిగణిస్తున్నాడు. ఈ కలయిక అన్ని అడ్డంకులను దాటి ముందుకు సాగుతుందా అనేది పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తోంది.


Recent Random Post: